https://oktelugu.com/

HBD Modi Ji : జనం మెచ్చిన మోడీ మార్కు టాప్ 10 సంక్షేమ పథకాలు

ఇక చట్ట సభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషనను మోడీ ఇచ్చి మహిళలందరి మనసు గెలిచాడు. జనం మెచ్చిన మోడీ మార్కు టాప్ 10 సంక్షేమ పథకాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోల్లో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2024 / 05:09 PM IST

    HBD Modi Ji : ఈరోజు మోడీ జన్మదినం.. 75వ సంవత్సరంలోకి ప్రవేశించారు. 74 ఏళ్ల మోడీ జీవితంలో దాదాపు 24 ఏళ్లు పరిపాలకుడిగా ఉన్నాడు. ఆయన రికార్డ్ ఏంటంటే.. ఎక్కడా కౌన్సిలర్ గా కూడా చేపట్టకుండా గుజరాత్ సీఎంగా.. డైరెక్ట్ కేంద్రంలో ప్రధానిగా 10 ఏళ్లు చేసి మూడో టర్మ్ కొనసాగుతున్నాడు.

    పది సంవత్సరాల మోడీ పాలనలో ఆయన జన్మదిన సందర్భంగా టాప్ 5 విజయాలు అంటే ఏంటో చూద్దాం. అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసినవి తెలుసుకుందాం..

    టాప్ 5 ఏంటని చూస్తే.. ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేస్తూ మోడీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా చెప్పొచ్చు.

    2వది 500 ఏళ్ల నాటి నుంచి ఉన్న వివాదం అయోధ్య రామాలయ నిర్మాణాన్ని మోడీ పూర్తి చేశాడు.

    ఇక మూడోది దేశం మొత్తం ఒకే పన్ను పెట్టి పన్నుల సరళీకరణను చేసిన ఘనతను మోడీ సొంతం చేసుకున్నాడు.

    ఇక సంక్షేమ పథకాల అమలుకు అవినీతికి తావులేకుండా డీబీటీ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారులకే ఫలాలు దక్కేలా మోడీ చేయడం అతిపెద్ద విజయంగా చెప్పొచ్చు.

    ఇక చట్ట సభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషనను మోడీ ఇచ్చి మహిళలందరి మనసు గెలిచాడు.

    జనం మెచ్చిన మోడీ మార్కు టాప్ 10 సంక్షేమ పథకాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోల్లో చూడొచ్చు.