Annamalai : తమిళనాట ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. ఇంకొక్క రోజుతో అయిపోబోతోంది. మరి అందరి దృష్టి ఎలా ఉందంటే.. అన్నామలై గెలుస్తాడా? లేదా? అక్కడ పరిస్థితి ఏంటనేది చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ ఎవరి దృష్టి పడని నియోజకవర్గం ఇంకొకటి ఉంది. చెన్నై సెంట్రల్ అతి చిన్న నియోజకవర్గం.. అక్కడ ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.చెన్నై సెంట్రల్ లో పోటీచేస్తున్నది డీఎంకేకు చెందిన కళానిధి మారన్ ఈ నియోజకవర్గంలో గెలుపుపై కూడా ఆసక్తి నెలకొంది.
ఇవాళ అన్నామలై గెలుస్తాడా? లేదా? అన్నది అందరి మదిలో ఉంది. కానీ నేషనల్ మీడియా సర్వేలు చూస్తే అన్నామలై గెలుపును ఖాయం చేశాయి. ఒక లీడర్ గెలుపు కోసం ఇంతగా ప్రజలు, మీడియా తాపత్రయం ఎప్పుడూ చూడలేదు. అన్నామలై లక్ష మెజార్టీతో గెలుస్తాడని తేలింది.
కోయంబత్తూరులో అన్నామలై వర్సెస్ అన్నాడీఎంకే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అన్నామలై పోటీ పేలవన్ తోనని తేలింది. అన్నామలై వర్సెస్ డీఎంకే పోటీగా మారింది. కొంగునాడు మొత్తం డీఎంకే వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది. అధికారంలో ఉన్న డీఎంకే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం, డబ్బులతో మలుపు తిప్పుతోంది.
లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్న అన్నామలై .. కోయంబత్తూరు పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.