https://oktelugu.com/

Tirupati Laddu Row : దేశవ్యాప్తంగా అవాక్కయిన హిందూ భక్తులు

తిరుమల తిరుపతి దేవస్థానానికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా దేవాలయాల్లో నాణ్యత పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా అవాక్కయిన హిందూ భక్తులు.. తిరుమల లడ్డూ వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2024 / 05:05 PM IST

    Tirupati Laddu Row : తిరుపతి లడ్డూ వివాదం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.. చంద్రబాబు సర్కార్ 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి ప్రకటన ఇంతటి ప్రకంపనలు సృష్టిస్తుందని ఆయన కూడా ఊహించలేదు. చిలికి చిలికి గాలివాన అయిపోయింది. ప్రతి ఒక్కరి నోట దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే హిందువులు ఉన్నారో వారంతా నోటి మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. హిందువులు అందరూ ఉలిక్కిపడే పరిస్థితి తీసుకొచ్చింది. అవాక్కైపోయారు. ఇది చిన్న విషయం కాదు.. హిందువులు పరమపవిత్రంగా పూజ్యంగా భావించే తిరుమల శ్రీవారి కొలువులోనే ఇంతటి అపచారం జరిగిందన్న దానిపై ఎలా వ్యక్తపరచాలన్న దానిపై తెలియక అయోమయంలో పడిపోతున్నారు. ఇది నిజమా? అని షాక్ అవుతున్నారు.

    ఇది నిజం కాకుండా ఉండే అవకాశం అయితే అనిపించడం లేదు. ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. రెండో శాంపిల్ లో కూడా అదే వచ్చింది. రెప్యూటెడ్ ల్యాబ్ రిపోర్ట్ ఇదీ. దీంట్లో ఎలా జరిగింది.? ఇంకా ఏ మతస్థులు అయినా ఇలాంటి అపచారం జరిగితే గగ్గోలు అయిపోయి ఉండేది.

    తిరుమల తిరుపతి దేవస్థానానికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా దేవాలయాల్లో నాణ్యత పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది.

    దేశవ్యాప్తంగా అవాక్కయిన హిందూ భక్తులు.. తిరుమల లడ్డూ వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.