ఇండీ కూటమి ఉంటుందా? ఊడుతుందా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆశలు చిగురించాయి. ఇప్పుడు ఉప ఎన్నికల తర్వాత డౌట్స్ పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే. బెంగాల్ లో కాంగ్రెస్, టీఎంసీ పోటీ.. కేరళలో ఎవరికి వారు పోటీ. యూపీలో సమాజ్ వాదీ పార్టీపై పోటీ.. ఇలా ప్రతీ రాష్ట్రంలో ఒకరిపై ఒకరు పోటీచేస్తుండడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
దీనికి ప్రధాన బాధ్యత ఎవరిది.. పెద్దపార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ది తప్పు కాదా.. క్యాస్ట్ సెన్సస్ తీసుకుంటే.. ఎన్నికల్లో కులగణన మీదనే మాట్లాడారు. టీఎంసీ కులగణనను వ్యతిరేకం. ఆవిడతో మాట్లాడిన పాపాన పోలేదు.
ఇండియా కూటమిలోని భాగస్వాములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. అదానీ విషయంలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండగా.. ఆ పార్టీలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
ఇండీ కూటమికి ముప్పు కాంగ్రెస్ పార్టీనే.. ఆ పార్టీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.