https://oktelugu.com/

UPI and UPI Lite : UPI కి UPI Liteకి తేడా ఏంటి? UPI Liteలో వచ్చిన మార్పులు ఏవి?

నేటి కాలంలో మనీ ట్రాన్స్ ఫర్ కోసం డిజిటల్ యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు.

Written By: , Updated On : November 27, 2024 / 12:25 PM IST
upi

upi

Follow us on

UPI and UPI Lite : నేటి కాలంలో మనీ ట్రాన్స్ ఫర్ కోసం డిజిటల్ యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు.. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ ల వరకు స్మార్ట్ మొబైల్ లోని ఫోన్ పే, గూగుల్ పే వంటి యాపుల్లో ఉన్న యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. యూపీఐ పై చాలా మందికి అవగాహన పెరగడంతో పాటు.. మనీ ట్రాన్స్ ఫర్ కు ఈజీ కావడంతో చాలామంది దీనినే ఫాలో అవుతున్నారు. అయితే నగదు చెల్లింపుల కోసం యూపీఐ మాత్రమే కాకుండా యూపీఐ లైట్ కూడా ఉందన్న విషయం కొద్దిమందికే తెలుసు. యూపీఐ లైట్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ మరింత ఈజీగా ఉంటుంది. మరి UPI కి UPI Liteకి తేడా ఏంటి? నవంబర్ 1 నుంచి UPI Liteలో కొన్ని మార్పులు చేశారు. అవేంటి? ఆ వివరాల్లోకి వెళితే..

చాలా మంది మొబైల్ ద్వారా మన సెండ్ చేయడానికి UPIని ఉపయోగిస్తుంటారు. దీనికి బ్యాంకు అకౌంట్ లింక్ చేసి అందులో నుంచి కావాల్సిన నగదును ఇతరులకు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తారు. అయితే అంతకుముందే దీనికి పిన్ నెంబర్ అడుగుతుది. ఆ పిన్ నెంబర్ ఎంట్రీ చేసిన తరువాతే మనీ సెండ్ అవుతాయి. అయితే UPI Liteలో అలా కాదు ఇందులో వాలెట్ ఉంటుంది. ఈ వ్యాలెట్ లోకి డబ్బులు జమ చేయాలి. ఆ తరువాత వాలెట్ నుంచే డబ్బులు పంపించుకోవాలి. అయితే UPI Lite నుంచి డబ్బులు పంపించే సమయంలో ఎలాంటి పిన్ అడగదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెంటనే డబ్బులు వెళ్లిపోతాయి.

National Payment Corporation Of India 2002లో UPI Liteని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ పర్ చేయడానికి పిన్ నెంబతో పాటు ఇతర ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో టైం వేస్ట్ అవుతుంది. అయితే యూపీఐ లైట్ ద్వార మనీ ట్రాన్స్ ఫర్ ఈజీగా ఉంటుంది. యూపీఐ లోనే యూపీఐ లైట్ ఉంటుంది. అయితే UPI Lite లో నవంబర్ 1 నుంచి కొన్ని మార్పులు చేశారు. అవేంటంటే?

UPI Lite లో ఉన్న వాలెట్ లో ఇప్పటివరకు కేవలం రూ.2,000 వరకు నగదును మాత్రమే యాడ్ చేసుకుని అవకాశం ఉండేది. దీనిని ఇప్పుడు రూ. 5000 లకు పెంచారు. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బు ఇతరులకు పంపించడానికి ఇది మంచి అవకాశం. మరొకటి ఏంటంటే వాలెట్ లోని డబ్బులు అయిపోగానే అందులో యాడ్ చేయాల్సి వచ్చేది. అంటే బ్యాంకు అకౌంట్ నుంచి వాలెట్ లోకి డబ్బులు జమ చేయాలి. కానీ ఇప్పుడు Auto Topup Facility అందుబాటులోకి వచ్చింది. దీంతో వాలెట్ ఆటోమేటిక్ గా బ్యాంకు అకౌంట్ నుంచి యాడ్ చేసుకుంటుంది. ఇది రూ.2,000 వరకు ఉంటుంది. UPI Lite నుంచి సింగిల్ ట్రాన్సాక్షన్ కేవలం రూ.5,000 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రూ.1000కి పెంచారు. దీంతో ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును పంపించుకోవాలంటే ఈ సదుపాయం అనుగుణంగా ఉంటుంది.