TTD : తిరుమల తిరుపతి దేవస్థానానిది సుదీర్ఘ చరిత్ర. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన ప్రాంతం. శేషాచలంపై శ్రీవారు వెలసిన దివ్యధామం తిరుమల.అటువంటి పుణ్యక్షేత్రం చెంతన వెలసిన ఆధ్యాత్మిక నగరం తిరుపతి. శతాబ్దాల కిందట తిరుపతి ఓ చిన్న గ్రామం. ఎన్నెన్నో పేర్లతో పిలవబడి ఇప్పుడు ఆధ్యాత్మికానికి పుట్టినిల్లుగా మారింది. మానవ జీవన విధానానికి, మనుగడకు, పూర్వీకుల చరిత్రకు నిలువెత్తు సాక్షాలుగా నిలిచే శిలా శాసనాలు తిరుపతి ఘన చరిత్రను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి.అటువంటి తిరుపతి ఈనెల 24వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటోంది. దాని వెనుక ఉన్న కథను ఒకసారి తెలుసుకుందాం.
చిన్న కుగ్రామంగా ఉన్న తిరుపతి అంచలంచెలుగా ఎదిగింది. ఉమ్మడి ఏపీలోనే ఒక మహానగరం గా మారింది. అయితే ఇలా రూపాంతరం చెందే క్రమంలో ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 1130 ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భవించినట్లు చరిత్ర చెబుతోంది. సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజుల గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించారని.. నిత్య కైంకర్యములు చేసి.. నాలుగు మాడవీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మించడం మొదలు పెట్టారని చరిత్ర చెబుతోంది. నాటి బీజమే నేటి తిరుపతి నగరం.
పవిత్రమైన తిరుమల తిరుపతి యాజమాన్యం ఎలా ఉండేది. మొదటి నుంచి రాజులు దీన్ని పెంచి పోషిస్తూ ఉండేవారు. వాళ్లే నిధులు సమకూర్చేవారు.
విజయనగర సామ్రాజ్యం అత్యంత ఫోకస్ చేసి కృష్ణదేవరాయలు ప్రాధాన్యతనిచ్చారు. ముస్లిం పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. చత్రపతి శివాజీ పాలనలో ఈ ఆలయాన్ని పునరుద్దరించి సహకారం అందించారు. ఆ తర్వాత చివరకు ఆర్కాట్ నవాబు కింద ఉన్నప్పుడు బ్రిటీష్ వారికి కప్పం చెల్లించలేక బ్రిటీష్ వారికి తిరుమల ఆదాయాన్ని తనఖా పెట్టాడు.
నవాబుల కాలం ముగిశాక.. 1801లో ఈ ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకు వెళ్లింది.విజయనగర కాలంలో వెలుగువెలిగిన ఆలయం.. బ్రిటీష్ వారి హయాంలో 1840లో ఈ ఆలయ బాగోగులు చూసుకోవాలని హాథీరాంజీ మఠంకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 1933 వరకూ హాథీరాంజీ మఠం కిందనే తిరుమల వ్యవహారాలు ఉండేవి. 1927లో బ్రిటీష్ వారు టీటీడీ యాక్ట్ అన్నది తీసుకొచ్చారు. 1933లో గొడవల తర్వాత మద్రాస్ ప్రభుత్వం కిందకు వెళ్లింది.
1951లో స్వాతంత్ర్యం తర్వాత తమిళనాడు దేవాలయాలు, తిరుమల దేవాలయాల కోసం ‘ఎండోమెంట్ యాక్ట్’ తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీ ఏర్పడ్డాక 1966లో కొత్త చట్టం చేసింది.1987లో తీసుకొచ్చిన చట్టం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఎన్నో చేతులు మార్పులు జరిగిన టీటీడీ యాజమాన్య చరిత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.