Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఎప్పుడూ లేని పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ జనవరి 20న పదవి చేపడుతారు. కానీ ఆయన చేయాల్సిన అపాయింట్ మెంట్స్ చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి ట్రంప్ అధ్యక్ష పాలన ఎంత మార్పులు చేస్తుందోనన్న ఆసక్తి అమెరికా సమాజంలో నెలకొంది.
అందరూ అనుకుంటున్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాడని ట్రంప్ అంటున్నారు. కోటికి పైగా ఉన్న అక్రమ వలసదారులను విమానాల్లో వారి దేశాలకు పంపిస్తాడట.. ఇది ఆచరణ సాధ్యమేనా? అన్నది ఆలోచిస్తున్నారు.
ట్రంప్ అపాయింట్ మెంట్ చేసిన వ్యక్తులను చూస్తే మొదటి నుంచి ఇటువంటి తీవ్రవాద భావాలున్న వారే నియామకం కావడం గమనార్హం. చైనా వ్యతిరేక ఇరుసుగా అపాయింట్ మెంట్ జరిగాయని అర్థమవుతోంది. వలసవాదులను తరమడంతోపాటు ప్రభుత్వాన్ని తగ్గించడాన్ని కూడా ట్రంప్ చేపట్టబోతున్నారు. ప్రభుత్వాన్ని ఎంత తక్కువ ఖర్చుతో నడిపించడం అన్న దానిపై ట్రంప్ దృష్టి సారించారు. ప్రభుత్వ ఖర్చులు, రెగ్యులేషన్స్, ప్రభుత్వ యంత్రాంగం సైజును తగ్గించాలని చూస్తున్నారు.
ట్రంప్ అమెరికాలో పాలనా పరమైన అంశాల్లో తీవ్ర మార్పులు చేపట్టబోతున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.