https://oktelugu.com/

Hydra Demolitions : మురుగు నీటి మూసీ తాగునీరు మూసీగా సాధ్యమేనా?

మురుగు నీటి మూసీ తాగునీరు మూసీగా సాధ్యమేనా? మూసీ ఆక్రమణలపై రేవంత్ ‘బుల్డోజర్’ న్యాయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 / 04:27 PM IST

    Hydra Demolitions : బుల్డోజర్ బాబా అంటే దేశంలో అందరికీ తెలుసు.. ఆయనే యోగి ఆధిత్యనాథ్. కొత్తగా దక్షిణ భారత బుల్డోజర్ బాబాగా రేవంత్ రెడ్డి అని సమాధానం ఇస్తోంది. అసలు ఈ బుల్డోజర్ న్యాయం అంటే ఏంటి? యూపీలో అత్యంత ప్రజాదరణ పొందింది.. దాన్ని కాపీ కొట్టి తాను పాపులర్ అవ్వాలని రేవంత్ రెడ్డి స్కెచ్ గీసినట్టు ఉన్నారు.

    యూపీలో అక్రమ ఆక్రమణలు తొలగించడం ముఖ్య ఉద్దేశం. వేరే ఇతర కేసుల్లో దారుణాతి దారుణాలు చేసి ఉంటే వాటిని బుల్డోజర్లతో నేలమట్టం చేసేవారు. యూపీ ఒక కమ్యూనిటీకి చెందిన వారివేనని అనుకోవడం తప్పు. దాంట్లో హిందూ, ముస్లిం, అన్ని మతాల వారు ఉన్నారు. జనాల్లో యోగి చర్య పాపులర్ అయ్యింది.

    ఇక హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, మూసీనదిలో అక్రమ ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి అదే బుల్డోజర్ న్యాయం తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి కోరిక. ఈ పద్ధతి ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే.. ఆక్రమణలపై కోర్టులకు వెళితే దశాబ్ధాలు పడుతుంది. అందుకే ఈ బుల్డోజర్ న్యాయాన్ని ఇప్పుడు ఎంచుకున్నారు.

    మురుగు నీటి మూసీ తాగునీరు మూసీగా సాధ్యమేనా? మూసీ ఆక్రమణలపై రేవంత్ ‘బుల్డోజర్’ న్యాయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.