https://oktelugu.com/

Revanth Reddy : రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కత్తి మీద సాములాగా వుంది

రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కత్తి మీద సాములాగా వుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2024 / 06:50 PM IST

    Revanth Reddy : రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఎలా ఉంది? అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. అందరూ హర్షించాలి. ఈ వయసులో సీఎం అయితే ఎంతో భవిష్యత్తు రేవంత్ కు ఉంటుంది. ఏ విషయంలోనైనా భాష ప్రయోగంతో మాట్లాడగలడు. కేసీఆర్ ఫ్యామిలీ మీద వచ్చిన వ్యతిరేకత సొమ్ము చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు.

    బీజేపీ కూడా ఇలానే హైప్ వచ్చింది. కానీ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని పనిగట్టుకొని రేవంత్, సునీల్ కనుగొలు చేసిన ప్రచారం తెలంగాణ ప్రజలు నమ్మారు. కవితను అరెస్ట్ చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలేయడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ నమ్మించగలిగింది.

    రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అందరినీ కలుపుకొని వెళ్లే పద్ధతిలోనే జరుగుతోంది. అయితే ఇదంతా తేలికకాదు.. కత్తిమీద సాములాంటిది.

    మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు పెద్దన్నగా కొనియాడాడు రేవంత్ రెడ్డి. మోడీతో స్నేహంగా మెగిలాడు. అయితే తెలంగాణకు నిధులు తీసుకురావడంలో రేవంత్ ఫెయిల్ అయిపోయాడు.

    పొద్దున లేస్తే అదానీని తిట్టే రాహుల్ గాంధీని కాదని.. తెలంగాణకు తీసుకొచ్చి అదానీతో రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకోవడం విమర్శలకు దారితీసింది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుతో రేవంత్ రెడ్డి సఖ్యతతో ఉండడం కూడా కాంగ్రెస్ వాదులకు రుచించడం లేదు.

    రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కత్తి మీద సాములాగా వుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.