Annamalai : అన్నామలై ఈజ్ బ్యాక్. మూడు నెలల విరామం తర్వాత తమిళనాడు గడ్డ మీద అన్నామలై అడుగుపెట్టాడు. రావడం రావడమే సందడి నెలకొంది. తమిళనోట ఎక్కడ చూసినా ఇదే మాట.. అదీ అన్నామలై స్పెషల్ క్యారెక్టర్.
అన్నామలై ఎయిర్ పోర్టులో దిగితే జనం పోటెత్తారు. విలేకరులు పెద్ద ఎత్తున గుమిగూడారు. జర్నలిస్టులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అన్నామలై తమిళనాడుకు రావడం పెద్ద పండుగ గా మారింది.
రాగానే అన్నామలైని హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీపై ప్రశ్నలు వేశారు. ‘విజయ్ రాజకీయ భవిష్యత్ గురించి అన్నామలైని జర్నలిస్టులు ప్రశ్నించారు. విజయ్ పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ కాదని.. అందరినీ సంతృప్తి పరచాలని పెట్టిన కిచిడీ పార్టీ అని అన్నామలై పేర్కొన్నాడు. టీవీకే విజయ్ పార్టీని జనం ఆదరించరని కుండబద్దలు కొట్టాడు. సిద్ధాంతం ఉంటే అదొక మరొక ద్రవిడ పార్టీగానే చూస్తారని స్పష్టం చేశాడు. మూడుగా ఓట్లు చీలుతాయి తప్పితే విజయ్ పార్టీతో తమకు ఏం నష్టం లేదని పేర్కొన్నాడు.
విజయ్ పార్టీ పెట్టాక ఎన్ని సార్లు ప్రజల్లోకి వచ్చాడని అన్నామలై సూటిగా ప్రశ్నించాడు. సినిమాల్లోకి వెళ్లిపోయిన విజయ్ పార్టీ కోసం ఇంకా పనులు మొదలుపెట్టలేదంటూ సెటైర్లు పెట్టారు.
అన్నామలై రావటంతో రాజకీయ సందడి మొదలు.. ఆయన రాజకీయ సమీకరణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.