Swachh Bharat Mission : స్వచ్ఛ భారత్ మిషన్ 2014 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగించి నేను స్వచ్ఛ భారత్ మిషన్ పెడుతున్నాను. ప్రతీ ఇంటికి టాయిలెట్ కట్టిస్తానని చెప్పారు. ఆరోజు దీనిపై ఎగతాళి చేసినవారు ఉన్నారు. ఇంకా ఏం దొరకలేదా? ఎర్రకోట నుంచి మాట్లాడడానికి అంటూ ఎద్దేవా చేశారు. టాయిలెట్లే దొరికాయా? అని ఆడిపోసుకున్నారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఈ స్వచ్ఛ భారత్ ప్రారంభించాడు. ఈ పథకం ఎలా అమలు జరిగింది? దాని వల్ల వచ్చిన ఫలితం ఏంటని తెలుసుకుందాం.
సెప్టెంబర్ 2న ‘నేచర్’ అనే క్రెడిబిలిటీ ఉన్న సైంటిఫిక్ మ్యాగజైన్ ఒక కథనం పబ్లిష్ చేసింది. ఆ పేపర్ యొక్క సారాంశం ఏంటని చూస్తే.. ఈ ఐదుగురు రైటర్స్ డిఫెరెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఏర్పడి రీసెర్చ్ చేశారు. దేశంలోని సర్వేలు, హెల్త్ డేటా, ఏజెన్సీల డేటా తీసుకొని 2014-2020 వరకూ వచ్చిన మార్పులను గమనించారు.
11 కోట్ల టాయిలెట్ కట్టించారు.6 లక్షల గ్రామాలకు బహిర్భూమి నుంచి విముక్తి కల్పించారు. వేస్ట్ మేనేజ్ మెంట్ కోసం ట్రీట్ మెంట్ ప్లాంట్లు పెట్టారు. ఇవన్నీ సత్ఫలితాలు వచ్చాయి.
టాయిలెట్లు, కుళాయి నీళ్ళు, వంట గ్యాస్ జీవన ప్రమాణాల్ని మార్చిందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.