PoK : గత నాలుగు రోజుల నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలు ప్రపంచాన్ని కళ్లు తెరిపిస్తున్నాయి. వాళ్లు ఇచ్చే స్లోగన్స్ ఏంటో తెలుసా? ‘అజాదీ’, పాకిస్తాన్ జెండాలు తగుల బెట్టడం.. భారత జెండాలు పైకి లేపారు.. కశ్మీర్ జెండాలు పైకి లేపడం.. ఇవన్నీ చూస్తుంటే 2019కి ముందు కశ్మీర్ లో లాల్ చౌక్ లో ఇవే దృశ్యాలు కనిపిస్తుండేవి..
కశ్మీర్ లోయలో పాక్ అనుకూల నిరసనలు ఉండేవి. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. మన మీద ఎగదోసిన అస్త్రాలే పాకిస్తాన్ కు శాపాలుగా మారాయి. కాల్పులు, కర్ఫ్యూలు, అగ్నిగుండంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ మారిపోయింది. అరెస్టులతో గందరగోళంగా ఉంది.
ఇప్పటికే ఒక పోలీస్ ఏఎస్ఐని ఆందోళనకారులు చంపేశారు. 100 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
ఒకనాడు మన కాశ్మీర్ లో జరిగింది ఇప్పుడు పిఒకె లో రిపీట్ అవుతోంది. పీవోకేలో పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.