Sadanandan Master gets RS seat: మోడీ.. నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేశారు.నిజం చెప్పాలంటే ఇదో మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. నలువైపులా ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు సమంగా పంచాడు. అందరిలోనా.. ‘సదానందం మాస్టర్’ను రాజ్యసభకు పంపడం హాట్ టాపిక్ గా మారింది.
ఈయన పుట్టింది హార్డ్ కోర్ సీపీఎం కుటుంబంలో.. కేరళలోని కన్నూర్ జిల్లాలో పుట్టాడు. పెరిగింది ఆ కన్నూర్ కమ్యూనిస్టు కంచుకోటలోనే.. అక్కడే చదివాడు. అయితే రానురాను సాంస్కృతిక జాతీయవాదం వైపు సదానందం మాస్టర్ మొగ్గు చూపాడు.
వివేకానంద ఫౌండేషన్ లోకి వెళ్లి ఆర్ఎస్ఎస్ కల్చరల్ ఈవెంట్ కు దగ్గరవడంతో అక్కడొక్క శాఖను ఏర్పాటు చేశాడు. సదానందం మాస్టర్ 1994లో చెల్లి పెళ్లి కోసం కారులో వెళుతుండగా.. కేరళలో కమ్యూనిస్టులు రెండు కాళ్లను నరికేశారు. ఆ కాళ్లను అతికిస్తారని కాళ్లను నాశనం చేశారు. మానవత్వం ఉన్నవాళ్లు ఇలా చేస్తారా? కేరళ కమ్యూనిస్టులను విభేదించినందుకు ఇలా చేశారు.
టీపీ చంద్రశేఖర్ కమ్యూనిస్టు పార్టీలో ఉండేవాడు. కమ్యూనిజం నచ్చక సొంత పార్టీ పెట్టాడు. దాన్ని భరించలేక కమ్యూనిస్టులు ఈయనను కూడా హత్య చేశారు. కన్నూరులో జరిగిన హత్యలు దేశమంతా షాక్ కు గురిచేశాయి. కన్నూరు క్రైం అడ్డగా మారింది.
సదానందన్ భయపడకుండా కృత్రిమకాళ్లు పెట్టుకొని ప్రచారం చేశాడు. 25 ఏళ్లు త్రిసూర్ లో టీచర్ గా పనిచేస్తూ ప్రజా సేవ చేశాడు. 30 ఏళ్లలో అందరూ ఈయనను చనిపోయినా.. మోడీ మరిచిపోకుండా సందానందన్ ను రాజ్యసభకు పంపి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సదానందన్ మాస్టారు కి రాజ్యసభ సీటు కేరళ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సదానందన్ మాస్టర్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
