Revanth Reddy : అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. సమస్య సమసిపోకుండా రోజురోజుకు పెద్దది అవుతోంది. ఈరోజు హీరో నాగార్జున కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణకు వచ్చింది.. రేపు స్వయంగా హీరో నాగార్జున వాంగ్మూలం కూడా ఇవ్వబోతున్నాడు. హీరో నాగార్జున ప్లేసులో ఎవరున్నా అదే చేస్తారు. ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరైనా ఇదే చేస్తారు.
కొండా సురేఖ మాట్లాడిన మాటలు.. ఓ మహిళా మంత్రి ఇలా మాట్లాడడం దారుణాతి దారుణమనే చెప్పాలి. కొండా సురేఖకు జరిగింది అన్యాయమే.. ట్రోల్ చేయడం తప్పు. కానీ సురేఖకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఈవిడ బాధ్యత గల వ్యక్తి. తెలంగాణ సమాజానికి ప్రతినిధి ఈమె..
కొండా సురేఖ వ్యాఖ్యలపై చిత్రపరిశ్రమ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ తర్వాత కొండా సురేఖ తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకుంటానని చెప్పుకొచ్చింది. కానీ క్షమాపణలు చెబుతున్నట్టు మాత్రం సురేఖ అనలేదు. అంత పెద్ద పేరున్న హీరోపై ఇంత గలీజు ఆరోపణలు ఎవరూ చేయలేదు. క్షమాపణ చెప్పకపోగా.. సురేఖకు మద్దతుగా మంత్రులు బయటకు రావడం జుగుప్సాకరంగా ఉంది. మంత్రులు సురేఖకు మద్దతు ఇవ్వడం.. రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండడం చాలా దారుణమనే చెప్పాలి.
రేవంత్ రెడ్డి గారూ హీరో నాగార్జున కుటుంబంపై మంత్రులు వాదనలపై మౌనం దేనికి సంకేతం? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.