Revanth Reddy Sparks Controversy : తెలంగాణలో ‘జైహింద్’ ర్యాలీ జరిగింది. ర్యాలీ జరపడం వరకూ బాగుంది. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన భాష, తీరు చూస్తే కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలా కనిపించింది. ఆపరేషన్ సింధూర్ విజయంతమైందని ర్యాలీ జరిపారా? లేక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కాలేదని చెప్పదలుచుకున్నారా? అర్థం కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధం ఆపడం ఏంటి? ప్రతిపక్షాలతో మీటింగ్ పెట్టి చేయాలని డిమాండ్ చేశారు.
పీఓకేను స్వాధీనం చేసుకోవాలని.. పాక్ పై యుద్ధం కొనసాగించాలని.. రఫేల్ యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని.. మన దేశంలోని విమానాలను ఎందుకు వాడడం లేదని రేవంత్ విమర్శలు గుప్పించారు. ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడడం వివాదాస్పదమైంది.
ముందుగా రేవంత్ తెలుసుకోవాల్సింది.. మన దేశంలో ‘రఫేల్’ యుద్ధ విమానాలను తయారు చేసే కెపాసిటీ ఈరోజుకు ఉందా? ఆ మాత్రం తెలియదా? కొనక తప్పదు.. మన దేశంలో తయారయ్యే యుద్ధ విమానాలకు ఆ పరిజ్ఞానం లేదు.
పాకిస్తాన్ అడిగినట్టు కాంగ్రెస్ మాట్లాడడం ఏంటి? అన్నది ప్రశ్న. రాహుల్ గాంధీని ముందు ప్రతిపక్ష నాయకుడిగా మెప్పించమనండి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.