Revanth Reddy : తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత రెండు, మూడు రోజులుగా అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధాలు నడుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సడెన్‌గా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివాదం తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. దాంతో.. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. డ్రగ్స్ కల్చర్‌కు వ్యతిరేకమని చెప్పిన బీఆర్ఎస్ నేతలు.. ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారంపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్లాన్ ప్రకారం ఫామ్ హౌస్ పార్టీని కాంగ్రెస్ నేతలు వివాదాస్పదంగా మార్చారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో పార్టీ విషయం తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ రేవ్ పార్టీ అని, బీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ అని వాదిస్తున్నాయి. బీజేపీ సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక జన్వాడ పార్టీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేస్తున్నది దారుణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది అది వారి ఫ్యామిలీ పార్టీగానే అభివర్ణిస్తున్నారు. ఆ పార్టీకి వచ్చిన వాళ్లంతా కుటుంబ సభ్యులేనని అంటున్నారు. తెలంగాణలో కుటుంబ సభ్యులు కలిసి మందు తాగడం సర్వ సాధారణమని అంటున్నారు.
ఇలా కుటుంబాలను టార్గెట్ చేసి ఆడవాళ్లను ఎక్స్ పోజ్ చేయడం బాగోలేదని కొందరు పేర్కొంటున్నారు. పేకాట కాయిన్స్ దొరికినవి అని చెబుతున్నారు. వాళ్లు ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా ఆడుకుంటానికి తెచ్చుకుని ఉండొచ్చు కదా అని అంటున్నారు. ఏది ఏమైనా.. జన్వాడ ఫామ్ హౌస్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.