Yogi Adityanath-Pawan Kalyan: మధురై దగ్గర తిరుపరన్ కుంబ్రం అనే ప్రాంతంలో మురుగన్ కు పుణ్యక్షేత్రం ఉంది. మధురై పక్కనే ఉంటుంది. అక్కడ హిందూ భక్తుల సమావేశం జరిగింది. ఫిబ్రవరి లో ఇక్కడ పెద్ద వివాదం జరిగింది. ఈ కొండపైన ఒక సుఫీ దర్గా ఉంది. 13వ శతాబ్ధం నుంచి ఈ దర్గా ఉంది. అక్కడ జంతుబలి, మాంసాహారం తింటున్నారని ప్రచారం జరిగింది. దీంతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నది.
ప్రభుత్వం ఈ కొండను సికిందర్ కొండగా మారుస్తారని ప్రచారం జరిగింది. ఇది మా హక్కు అని కొందరు దేవాలయానికి దగ్గర బిర్యానీలు తినడం కొందరు ముస్లిం నాయకులు దాంట్లో పాల్గొనడంతో పెద్ద వివాదమైంది.
మురుగన్ తమిళనాడులో ఇష్టదైవం. అక్కడ మాంసాహారం అసల వండరు, తినరు. దర్గా వల్ల అక్కడ ఇదంతా జరుగడం హిందూ భక్తులకు కోపం తెప్పించి పెద్ద నిరసన వ్యక్తమైంది.
మురుగన్ దేవాలయాలకు రక్షణ లేదని.. అవమానిస్తున్నారని ఒక హిందూ మున్నా అని ఒక సభ జరపాలని నిర్ణయించారు. డీఎంకే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో హైకోర్టుకెళ్లారు. జూన్ 22న 5 లక్షల మందితో అక్కడ మురుగన్ భక్తుల సమావేశం నిర్వహిస్తున్నారు.
ప్రసిద్ధ మధురై మురుగన్ దేవాలయం దగ్గర 5 లక్షల మందితో భక్తుల మహాసభ. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
