Pawan Kalyan returned remuneration : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియాలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) మొదటి నుంచి కూడా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు. కెరియర్ మొదట్లో వరుసగా ఏడు విజయాలను అందుకొని పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో కూడా తనే కావడం విశేషం… అయితే ఆయన చేసిన సినిమాలు సరిగ్గా ఆడక పోవడం వల్ల కొంతమంది ప్రొడ్యూసర్స్ కి తను తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటగా ఆయన డైరెక్షన్లో వచ్చిన జానీ (Johnny) సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కొంతవరకు నష్టాలను చవి చూశాడు. ఇక అదే సమయంలో ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ను తిరిగి ఇచ్చేయాలని నిశ్చయించుకొని పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని అల్లు అరవింద్ కి తిరిగి ఇచ్చేశారట… ఇక ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) సినిమా సమయంలో కూడా ఆ సినిమా రిలీజ్ కి ముందే లీక్ అవ్వడం తో ప్రొడ్యూసర్ తీవ్రమైన నష్టాలను చవిచూస్తాడేమో అనే ఉద్దేశంతో సినిమా రిలీజ్ కి ముందే తను తీసుకున్న రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేశాడు. దాంతో ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని చాలామందికి తెలిసింది. ఇక సినిమాల వల్ల అతనికి చాలామంది అభిమానులు ఏర్పడితే తన వ్యక్తిత్వ పరంగా కూడా అంతకంటే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : సరికొత్త పోస్టర్ తో ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..షేక్ అయిన సోషల్ మీడియా!
ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లు సాధించిన విజయాలను చాలా గొప్పగా చూపించుకుంటున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) మాత్రం సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఇక ప్రస్తుతం హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) ప్రొడ్యూసర్ అయిన ఏ ఏం రత్నం (A M Rathnam) కూడా తను తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశాడు అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తే సక్సెస్ అయితే ప్రొడ్యూసర్స్ భారీ ఇన్ లాభాలను అందుకుంటారు.
ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే కూడా అతను తీసుకునే రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేస్తారు. కాబట్టి నష్టాలు కూడా పెద్దగా రావానే ఉద్దేశ్యంతో ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…