Telangana Politics : తెలంగాణలో బూతు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఆంధ్రాలో కులాలతో కొట్లాడుతుంటే.. ఇన్నాళ్లు తెలంగాణ చాలా బెటర్ అనుకున్నాం.. కులాలకు ఇక్కడ అంత ప్రాధాన్యం లేదని సామరస్యంగా ఉంటారని అనుకున్నాం.. కానీ వినటానికే దారుణంగా ఇక్కడ రాజకీయం మారిపోయింది..
మెదక్ జిల్లాలో కళ్యాణలక్ష్మీ షాదీ ముబారక్ కార్యక్రమంలో నేతన్నలు నేసిన చేనేత దండను మంత్రి కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వేశారు. దీన్ని దారుణంగా బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేశారు. ఇదంతా కేటీఆర్ మనుషులు చేశారన్నది ఆరోపణ.. సీతక్కను ఇలానే ట్రోల్ చేశారని ఆమె వాపోయింది. దీంతో వారు కేటీఆర్, హరీష్ లు ఈ ట్రోలింగ్ ను అరికట్టాలని పిలుపునిచ్చారు.
హరీష్ రావు ఈ చర్యను ఖండించారు. ఎవరు చేసినా తప్పేనని ఒప్పుకున్నాడు. కేటీఆర్ మాత్రం స్పందించలేదు. అంతటితో ఈ వివాదం ఆగలేదు. మంత్రి కొండా సురేఖ కోపంతో తోటి మహిళ నటి సమంతను ఉద్దేశించి దారుణంగా కామెంట్ చేసింది. నాగార్జున, కేటీఆర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొండా సురేఖ మాట్లాడిన ఈ మాటలు ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదు.. మంత్రిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం దారుణమనే చెప్పాలి.
సభ్య సమాజంలో ఒక మహిళా మంత్రి ఇలా మాట్లాడుతారని ఎవ్వరూ ఊహించలేదు. సురేఖ మాటలు విన్నాక అసహ్యమేస్తోంది. ఆమెపై అస్సలు సానుభూతి వ్యక్తం కావడం లేదు. పైగా సారీ చెప్పకుండా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానడడం దారుణమనే చెప్పాలి.
మహిళల వ్యక్తిత్వ హననమే కేంద్రంగా తెలంగాణ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.