Israel Vs Iran : అక్టోబర్ 7 ఇంకా నాలుగు రోజులు ఉంది. పోయిన సంవత్సరం అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి వందల మంది ఇజ్రాయిలీ ప్రజలను ఊచకోత కోశారు. వందల మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. గాజాపై అప్పుడు దాడులు చేసిన ఇజ్రాయిల్ ఇప్పటికీ హమాస్, హిబ్ బుల్లాలపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. గాజా దాదాపు శ్మశానంగా మారిపోయింది.
మధ్యలో యెమెన్ నుంచి హౌతీలు ఇజ్రాయిల్ మీద మిస్సైల్ లు ప్రయోగించారు. హిజ్ బుల్లో దాడులూ చేస్తూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం.. గాజాలో మిగిలిన ప్రభుత్వ అధిపతి రావి ముస్తాఫ్ ను ఇజ్రాయిల్ చంపేసినట్టు సమాచారం.
అంతకుముందు ఇరాన్ రాజధాని లో హమాస్ లీడర్ ను ఇజ్రాయిల్ చాకచక్యంగా హతమార్చింది. లెబనాన్ లో హిజ్ బుల్లా అగ్రనేతలను అంతం చేసింది. దాదాపు ఇజ్రాయిల్ వ్యతిరేకులందరినీ పోయిన వారం హతమార్చేసింది.
ఇరాన్ గతి లేక అక్కడి ప్రజల తిరుగుబాటుతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ పై బాంబుల దాడి చేసింది. మిస్సైల్ పేల్చగా అన్నీ ఇజ్రాయిల్ పక్క దేశాల్లోనే పడింది. ఇజ్రాయిల్ అన్నింటిని తుత్తునియలు చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ ట్రాప్ లో పడిన ఇరాన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.