Supreme Court On Waqf Bill: మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. వక్ఫ్ బోర్డుల అధికారం, ఆస్తులపై నియంత్రణ, నిర్వహణ విధానాల్లో మార్పులు తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన ఈ సవరణలకు ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వం ప్రకారం, వక్ఫ్ బోర్డుల ఆస్తులపై పారదర్శకతను పెంచడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, అలాగే వక్ఫ్ ఆస్తులను సామాజిక ప్రయోజనాలకు మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడమే ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు వక్ఫ్ బోర్డులు స్వతంత్రంగా ఆస్తులపై అధికారం చలాయించగా, కొత్త సవరణల తర్వాత ప్రభుత్వ పర్యవేక్షణ మరింత బలపడనుంది.
ఈ సవరణలపై కొంతమంది వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్లు వేసినప్పటికీ, సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. “జనహితం దృష్ట్యా తీసుకువచ్చిన సవరణలు కావున అడ్డంకులు ఉండవు” అని స్పష్టం చేసింది. దీంతో మోడీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
ఈ తీర్పుతో రాబోయే ఎన్నికల దృష్ట్యా మోడీ ప్రభుత్వం మైనారిటీ ఆస్తులపై పారదర్శకత కల్పించామని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు దీనిని ముస్లిం వర్గాల హక్కులపై దాడిగా చూపించే ప్రయత్నం చేయనున్నాయి.
మోడీ ప్రభుత్వ వక్ఫ్ చట్ట సవరణలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.