గత నాలుగు రోజుల నుంచి టాలీవుడ్ లో జరుగుతున్న మకిలి వ్యాపారాన్ని గురించి పుంఖాను పుంఖలుగా కథనాలు వస్తున్నాయి. తెరవెనుక ఎన్ని కలలు కన్నా కూడా తెరవెనుక సినిమా పెద్దలు వేరే కలలు కంటున్నారు. మొత్తం సినీ వ్యాపారాన్ని తమే సొంతం చేసుకోవాలన్న పథకాన్ని రచిస్తున్నారు. డబ్బుల చుట్టూ సినిమా వ్యాపారం తిరుగుతోంది.
సినిమాకు డబ్బులు సమకూర్చేది అంతా నిర్మాతనే. వాళ్లకు ఏ రోజుకు కూడా అడ్డంకులు లేవు. పెద్ద నిర్మాతలకు ఏం కాదు. చిన్న నిర్మాతలకే కష్టం. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ త్రీ టైర్స్ సిస్టం ఉంటుంది.
ఇటీవల కాలంలో గత 10, 20 ఏళ్లలో టోటల్ గా మారింది. త్రీ టైర్ సిస్టం కాస్త వన్ టైర్ గా మారింది. నిర్మాతలే అన్నీ చేస్తున్నారు. ఒక నలుగురు అయిదుగురే కంట్రోల్ చేస్తున్నారు. ప్రేక్షకులకు డైరెక్టుగా కనెక్ట్ అయ్యేది ఎగ్జిబ్యూటర్స్ అంటే థియేటర్ యజమానులు. 1500 స్క్రీన్లు నిర్మాతలకు ఉన్నాయి. వీటిల్లో పరిస్థితి ఏంటంటే.. ఒక నలుగురు ఐదుగురు నిర్మాతల చేతుల్లోనే ఈ గుత్తాధిపత్యం నడుస్తోంది.
తెర ముందు ప్రేక్షకుల రంగుల కల తెర వెనక పెద్దల మకిలి వ్యాపారంగా మారింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
