Pakistan : పోయేకాలం దాపురించినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అంతకు దిగజారుతోంది. ఓవైపు బలూచిస్తాన్ ల పోరాటం.. మరోవైపు ఫస్తూన్ ల ఇస్లామిక్ తిరుగుబాటు కాలదన్నట్టు.. సింధీల కాల్వల యుద్ధం.. ఈ కాల్వల యుద్ధం ఏంటని చూస్తే..
పాకిస్తాన్ లోని చోలిస్తాన్ ప్రాంతం.. రాజస్థాన్ ఏడారికి ఆనుకొని దక్షిణ పాకిస్తాన్ పంజాబ్ లోని కరువు ప్రాంతం ఇదీ. దీనికి రెండు ఇంపార్టెంట్ కాంపోనెట్స్ ఉన్నాయి. చోలిస్తాన్ లో పాకిస్తాన్ ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. గల్ఫ్ దేశాలను పాకిస్తాన్ డబ్బులు అడుక్కుంటోంది. సౌదీ, యూఏఈ, ఇతర దేశాలకు పాకిస్తాన్ 3 బిలియన్ల డాలర్ల అప్పులు ఉంది. చోటీస్తాన్ లోని ప్రాంతం భూములను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలని పాకిస్తాన్ నిర్ణయించింది. అంటే పాకిస్తాన్ భూములను గల్ఫ్ దేశాలకు అప్పగించడమే.. అక్కడ గల్ఫ్ దేశాలు పెట్టుబడులు పెట్టనున్నాయి. గ్రీన్ ఫీల్డ్ పాకిస్తాన్ పేరిట ప్రాజెక్ట్ చేపట్టారు.
అయితే ఇక్కడ నీరు లేకపోవడంతో సింధూ నది నుంచి కాలువలు తవ్వుకుంటూ చోలిస్తాన్ కు నీళ్లు అందిస్తారట.. ఈ కాలువలు ప్రారంభించేందుకు పంజాబ్ సీఎం, పాక్ ఆర్మీ చీఫ్ వచ్చి కలిసి ప్రారంభించారు.
అయితే పంజాబ్ ఈ కాలువల తవ్వకాన్ని సింధూ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చోలిస్తాన్ కు కాలువలతో నీటిని తీసుకెళితే సింధూ రాష్ట్రానికి నీళ్లు రావు. సింధూలోని కరాచీ, హైదరాబాద్ వంటి పట్టణాలు నీటి కోసం అల్లాడుతాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు సింధూ రాష్ట్ర ప్రజలు పోరాడుతున్నారు. దీనికి జాతీయ నేతలు కూడా తోడై సింధూల కోసం పోరాటం మొదలుపెట్టారు.
పాకిస్తాన్ లో పంజాబ్ సింధ్ మధ్య కాల్వల యుద్ధంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
