Kiran Rijiju : ఏప్రిల్ 15న ‘థాంక్యూ మోడీ’ అనే కార్యక్రమాన్ని ‘మునంబం’ గ్రామ ప్రజలు నిర్వహించారు. వక్ఫ్ చట్టంను కేంద్రం ఆమోదించిన సందర్భంగా ‘మునంబం’ గ్రామస్థులు ఈ పండుగ చేశారు. మైనార్టీ ఎఫైర్స్ మినిస్టర్ స్వయంగా ఈ గ్రామానికి వెళ్లారు.చాలా మంది ఆయన పర్యటనను ఆసక్తిగా గమనించారు.
కిరణ్ రిజిజు ప్రెస్ కాన్ఫరెన్స్, గ్రామ ప్రజలతో కలిశారు. క్యాథలిక్ పెద్దలతో కూడా కలిశారు. ఈ చట్టంతో ద్వారా వక్ఫ్ ట్రిబ్యూనల్ సర్వాధికారాలు లేకుండా కోర్టుకు వెళ్లే అవకాశం తీసుకొచ్చాం. కోర్టుకు ఎవరైనా వెళ్లొచ్చు. సెక్షన్ 40 రద్దు చేశారు. వక్ఫ్ ఆస్తి అని బోర్డ నమ్మితే ఏ భూమినైనా వారు ఆక్రమించవచ్చు. దీని ద్వారా మునంబం లాంటి సమస్యలు ఇక రావు.
ఇప్పుడు మునంబం గ్రామానికి ఈ చట్టం వర్తిస్తుందా? అని ప్రశ్నించిన విలేకరులకు కిరణ్ సమాధానం చెప్పలేకపోయారు. రూల్స్ రూపొందించాక ఇది అమలు చేస్తామని తెలిపారు. దీంతో మునంబం సమస్య పరిష్కారం కాదా? అన్న ఆందోళన నెలకొంది.
కిరణ్ రిజిజు మునంబం పర్యటన సఫలమా? విఫలమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
