Telugu Film Industry : ఈరోజు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. టీవీల నిండా ఈరోజు అదే వార్త హోరెత్తింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ చర్చలు జరపడం దేనికి సంకేతం. చర్చల సారాంశం ఏంటి? ముందుగా పోలీసులు ఒక వీడియోను సినీ పరిశ్రమ వారికి చూపించారట.. మేం చేసిందే కరెక్ట్ అని చిత్ర పరిశ్రమ చేత ముద్ర వేయించుకోవడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
చిత్ర పరిశ్రమ పెద్దలు మరి ప్రభుత్వాన్ని కొన్ని పాటించాలని సూచించే దమ్ము ఎవరికీ లేకుండా పోయింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి.. సినీ పరిశ్రమ పెద్దలు, నాగార్జున గురించి మాట్లాడిన మాటలు ఎవరైనా ఖండించాల్సిందే. మరి దాని గురించి రేవంత్ ఏమైనా చర్యలు తీసుకున్నారా? అటువంటి మంత్రిని క్యాబినెట్ లో కూర్చుండబెట్టుకొని మేం పర్ ఫెక్ట్ అని చెప్పే హక్కు రేవంత్ ప్రభుత్వానికి ఉందా? అన్నది ప్రశ్న.
ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఆంధ్రోడు.. బతకడానికి వచ్చినవాడు అంటే ఎమ్మెల్యేకు కనీసం సంజాయిషీ నోటీసు ఇచ్చావా? అన్నది ప్రశ్న. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎవరైనా ప్రశ్నించారా?
తన ఎన్ కన్వేన్షన్ కూలగొట్టినా నాగార్జున ఈ మీటింగ్ కు హాజరై రేవంత్ రెడ్డికి శాలువ కప్పి సన్మానించారు. ఇక తన కొడుకును జైల్లో పెట్టినా అల్లు అరవింద్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు. దీన్ని బట్టి సినీ పరిశ్రమలో ఎవరికీ వెన్నెముక లేదని అర్థమవుతోంది.
సినీ పరిశ్రమలో గట్టిగా నిలబడింది ఇద్దరే.. వాళ్లే ఒకటి సీనియర్ ఎన్టీఆర్.. రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్.. వీరిద్దరే గట్టిగా నిలబడింది.. మిగతా వారంతా వెన్నెముక లేనివారే..
సందేశం కేవలం చిత్ర పరిశ్రమకేనా మరి ప్రభుత్వానికి లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.