Education : సమాజ పురోగతికి కొలబద్దలు ఏంటి అంటే విద్యాప్రమాణాలు.. ఎందుకు ఇందులో ముఖ్యం అంటే.. దాని భవిష్యత్ సమాజం ఎలా ఉంటుందో ఇవి చెబుతాయి. విద్యాప్రమాణాలు అంటే కనీసం అక్షరాలు రావాలి. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా టెక్నికల్ కోర్సులు, డిగ్రీలు కాదు.. ఫౌండేషన్ కోర్సు.. అంటే కనీసం భాష అనే దానిపై అవగాహన.. అంకెలపై అవగాహన కలిగి ఉండాలి.
ఈ రెండూ వస్తే ప్రపంచంతో మనం కనెక్ట్ కావచ్చు. అంతర్జాతీయంగా మనుగడ సాగించాలంటే ఇవి ఉంటే చాలు. 10 సంవత్సరాల లోపు భారత్ లో ఎలా ఉంది అనే దానిపై సర్వే చేశారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో ’ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ సర్వే చేశారు. ఇన్ స్టిట్యూషన్ ఫర్ కాంపీటీటివ్ నెస్ అని చేశారు. అందరి సహకారం అమెరికా ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనికి తోడ్పాటునందించాయి.
ఉత్తరాది కంటే దక్షిణాది అభివృద్ధి చెందిందని అందరూ అనుకున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలు ఎంత దారుణంగా ఉన్నామంటే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక తీసేస్తే.. ఉత్తరాధి రాష్ట్రాల కంటే రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా ఉన్నాయి.
చిన్న పిల్లల విద్యా ప్రమాణాలు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు సిగ్గుతో తలదించుకోవాలి.. ఈ సర్వేపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.