https://oktelugu.com/

Palakkad By Elections : పాలక్కాడ్ ఉపఎన్నికతో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న బీజేపీ?

Palakkad By Elections: పాలక్కాడ్ ఉపఎన్నికతో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న బీజేపీ? తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు.

Written By: , Updated On : November 18, 2024 / 09:05 PM IST

Palakkad By Elections : పాలక్కాడ్ ఉపఎన్నిక ఈనెల 20న కేరళలో జరుగబోతోంది. వయనాడ్ లో జరిగిన ఎన్నిక అంత ఉత్కంఠ రేపలేదు. కానీ పాలక్కాడ్ ఎన్నికపై కేరళ మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కారణం ఒకే ఒక్కటి.. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ ఓట్లు, ఓట్ల శాతం చూస్తే పరిస్థితి మనకు అర్థమవుతుంది.

2011 నుంచి 2021 వరకూ మూడు అసెంబ్లీలు చూస్తే.. సీపీఎం 36 శాతం నుంచి 26 శాతానికి పడిపోయింది. బీజేపీ 20 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ఇక కాంగ్రెస్ 42 శాతం నుంచి 38 శాతానికి పడిపోయింది. ఈ మూడు ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే..

దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే.. సీపీఎం మూడో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఇక్కడ పోటీ ఉండనుంది. అందుకే సీఎం విజయన్ పాలక్కాడ్ ను టార్గెట్ చేసి రెండు రోజులు అక్కడే మకాం వేసి బీజేపీని ఓడించాలని చూస్తున్నాడు.

పాలక్కాడ్ ఉపఎన్నికతో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న బీజేపీ? తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు.

పాలక్కాడ్ ఉపఎన్నికతో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న బీజేపీ? || Palakkad Assembly By Elections 2024