Modi : తెలుగు ప్రజలే మోడీకి తిరిగి అధికారంలోకి తెచ్చారు

Modi: తెలుగు ప్రజలే మోడీకి తిరిగి అధికారంలోకి తెచ్చారు

Written By: NARESH, Updated On : June 4, 2024 4:58 pm

Modi : అందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఇందులో అన్నింటికంటే స్పెషల్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అని నిరూపించుకున్నారు.

పవన్ మొదటి నుంచి ఒక్కటే స్టెప్ తీసుకున్నారు. తాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని శపథం తీసుకున్నాడు. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో దాన్ని విమర్శించిన వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ బలపడాలని అందరూ విమర్శించారు.

కానీ ఇన్ని విమర్శలు వచ్చినా పవన్ వ్యూహం పర్ ఫెక్ట్ గా కుదిరింది. అసలు టీడీపీని, బీజేపీని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి పవన్ పడ్డ కష్టం అంతా ఇంతాకాదు. చంద్రబాబును, జగన్ జైల్లో పెట్టినప్పుడు పవన్ స్వయంగా జైలుకెళ్లి పరామర్శించారు. ఢీలా పడిపోయిన క్యాడర్ కు ఉత్తేజం ఇచ్చే పద్ధతుల్లో జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం.. పొత్తును ప్రకటించడం టీడీపీ క్యాడర్ లో ఎక్కడలేని ఉత్సాహాన్ని తిరిగి తీసుకువచ్చింది పవన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక టీడీపీతో పొత్తు వద్దు అంటున్నా బీజేపీ పెద్దల నుంచి తిట్లు తిని మరీ టీడీపీతో బీజేపీ పొత్తు కుదుర్చాడు పవన్. ఇప్పుడు ఉత్తరభారతంలో బీజేపీకి మెజార్టీ తగ్గిన వేళ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన సీట్లతోనే కేంద్రంలో బీజేపీ నిలబడింది.. అందుకే ‘తెలుగు ప్రజలే మోడీని తిరిగి అధికారంలోకి తెచ్చారు’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. పవన్ కళ్యాణ్ చొరవపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.