Rajeev Chandrasekhar
Rajeev Chandrasekhar : రాజీవ్ చంద్రశేఖర్.. కేరళ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. కేరళ బీజేపీ గ్రౌండ్ లెవల్ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తి రాజీవ్. త్రిసూర్ లో చదువుకున్నాడు. ఎంటర్ పెన్యూర్ గా స్థిరపడడం.. రాజకీయ నాయకుడిగా ఎదిగిన విషయంలో కేరళకు ఎటువంటి సంబంధం లేదు. నాన్ ఆర్ఎస్ఎస్ వ్యక్తిని… కేరళలలో ఎక్కువ భాగం లేని వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిని చేసి అందరినీ కమలదళం ఆశ్చర్యపరిచింది.
2024లో పార్లమెంట్ ఎన్నికల్లో శశిథరూర్ పై పోటీచేసి తక్కువ మార్జిన్ లో ఓడిపోయాడు. బెసికల్లీ మలయాళీ ఈయన తండ్రి. తర్వాత బెంగళూరులో వ్యాపారంలో రాజీవ్ ఎదిగాడు. ఢిల్లీలో ప్రముఖంగా వ్యాపారం నిర్వహించారు. కానీ కేరళకు ఈయనను బీజేపీ అధ్యక్షుడిగా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సురేందర్ ప్రస్తుతం కేరళ అధ్యక్షుడిగా ఐదేళ్లుగా ఉన్నారు. ఇక మిగతా నేతలంతా కూడా కేరళ అధ్యక్షులుగా చేసిన వారే.. ఒక శోభా సురేంద్రన్ కూడా రేసులో ఉన్నా.. ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.. ఎన్నికల ముందు ఆమె చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. చాయిస్ తక్కువగా ఉండడం.. న్యూట్రల్ ఓట్లు, కొత్త ఓటర్లను సంపాదించేందుకు రాజీవ్ ను ఎంపిక చేసి ఉండొచ్చు.
కేరళలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండడం వల్ల న్యూట్రల్ గా ఉండే రాజీవ్ ను కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమించి ఉండొచ్చు.
ఓ పారిశ్రామిక వేత్తను బయట వాడిని కేరళ బీజేపీ అధ్యక్షునిగా నియామకం వెనుక కారణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు