https://oktelugu.com/

Rahul Gandhi : సిక్కుల్ని రెచ్చగొట్టి భారత్ వ్యతిరేక ఇల్హాన్ ఒమర్ తో భేటీ అయితే ఏమనాలి?

సిక్కుల్ని రెచ్చగొట్టి భారత్ వ్యతిరేక ఇల్హాన్ ఒమర్ తో భేటీ అయితే ఏమనాలి? రాహుల్ గాంధీ చర్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2024 / 07:04 PM IST

    Rahul Gandhi : రాహుల్ గాంధీ దారుణంగా మాట్లాడుతున్నారు. నిన్నా మొన్నా అమెరికాలో అత్యంత దారుణాతి దారుణంగా మాట్లాడారు. సోమవారం ‘హ్యాండన్’లో రాహుల్ మాట్లాడుతూ.. సిక్కుల గురించి దారుణ కామెంట్స్ చేశాడు. సిక్కులకు భద్రత లేదని.. భయం భయంగా బతుకుతున్నారని.. తలపాగా ధరించే స్వేచ్ఛ లేదని.. కడెం, కత్తి ని పెట్టుకునే స్వేచ్ఛ లేదని.. గురుద్వారాకు వెళ్లడానికి భయపడుతున్నారని ఆరోపించారు.

    వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే.. భారత్ లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన సంఘటన ఏదైనా ఉందంటే అది రాజీవ్ గాంధీ హయాంలోనే.. ఇందిరాగాంధీ హత్య అనంతరం తలపాగాలు తీసేసి… జుట్టు కోసేసి.. కడాలను తీసేసి సిక్కులను కాంగ్రెస్ వాదులు చంపేశారు. ఆ టైంలోనే సిక్కులపై దమనకాండ జరిగింది.

    కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణాలను రాహుల్ ఎందుకు మాట్లాడడం లేదు. రాహుల్ ను అభినందించింది కెనడా సిక్కు ఖలిస్తాన్ ఉద్యమకారుడు గురుపత్వంగ్ సింగ్ పన్ను. శభాష్ రాహుల్ గాంధీ అంటూ ట్విట్టర్ లో కొనియాడారు. ఇదే పన్ను ఇందిరాగాంధీ హత్యను డిస్ ప్లే చేస్తూ ఊరేగించారు.

    సిక్కుల్ని రెచ్చగొట్టి భారత్ వ్యతిరేక ఇల్హాన్ ఒమర్ తో భేటీ అయితే ఏమనాలి? రాహుల్ గాంధీ చర్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.