Revanth Reddy : రేవంత్ రెడ్డి మాటలకి జనం నవ్వుకుంటున్నారు

రేవంత్ రెడ్డి మాటలకి జనం నవ్వుకుంటున్నారు.. ఆయన ప్రసంగంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 20, 2024 3:37 pm

Revanth Reddy : తెలంగాణ రాజకీయాలు గమ్మత్తుగా ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లో మాట్లాడింది వింటే అందరికీ నవ్వు వచ్చేసింది.మొన్న కేరళ వాయినాడ్ వెళ్లి అక్కడ కూడా అదే మాట మాట్లాడాడు. జూన్ 9న ముహూర్తం పెట్టుకున్నారట.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ఎర్రకోట లో త్రివర్ణ పతాకం ఎగురవేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారట.. ఈ మాట అన్న రేవంత్ రెడ్డి మాట నవ్వుల పాలైంది. 21వ శతాబ్ధపు జోక్ లాగా ఇది ఉంది. ఈ ఎన్నికలకు అతిపెద్ద జోక్ గా మారింది.

పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈరోజు తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించి అన్నట్టుగా గెలిచాడు. అలానే దేశానికి రాహుల్ గాంధీ ప్రధానిగా అవుతారని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. జనం అంత అమాయకులు కారు.. రేవంత్ చెప్పారనో.. ఇంకెవరో చెప్పారని జనాలు గుడ్డిగా రాహుల్ గాంధీకి ఓట్లు వేయరు.. ప్రధానిని చేయరు.

రేవంత్ రెడ్డి మాటలకి జనం నవ్వుకుంటున్నారు.. ఆయన ప్రసంగంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.