https://oktelugu.com/

Rahul Gandhi : రాహుల్ గాంధీ పప్పు కాదు తప్పు చేస్తున్నాడు

రాహుల్ గాంధీ పప్పు కాదు తప్పు చేస్తున్నాడు.. రాహుల్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2024 / 08:54 PM IST

    Rahul Gandhi : రాహుల్ గాంధీ పప్పు కాదు.. కానీ తప్పు చేస్తున్నాడు. ప్రతీసారి విదేశాలకు వెళ్లి ఏదో ఒకటి వాగుతున్నాడు. ప్రతీసారి ఇదే తంతు. ఈసారి బలి అయ్యింది ఎవరంటే టెక్సాస్ లోని డల్లాస్ వాస్తవ్యులు.. ఏదో తను ఒక మేధావి అనుకుంటాడు రాహుల్ గాంధీ.

    విదేశాలకు వెళ్లినప్పుడు దేశం గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి. ఏదో తన మేధావితనం చూపించాలని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ‘ఆర్ఎస్ఎస్’ బీజేపీ మీద పడుతుంటాడు.ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాడు. బీజేపీ వాళ్లు భూతంలాగా బయటకు చూపిస్తాడు.

    బీజేపీ వాళ్లు ఒకే ఐడియాతో ఉంటారు. విభిన్న సంస్కృతులు అంటే గౌరవం లేదట.. రెండోది మహిళలు అంటే గౌరవం లేదట.. మహిళలు వంటకే పరిమితం అవ్వాలని ఆర్ఎస్ ఎస్ చెబుతుందట.. అసలు మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం సున్నా.

    మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీలో ఇద్దరు మహిళలున్నారు. సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారమన్ లు ఉండేవారు. బీజేపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. 3 ఇంట 1 వంతు రిజర్వేషన్ ను బీజేపీ ఇచ్చింది.

    రాహుల్ గాంధీ పప్పు కాదు తప్పు చేస్తున్నాడు.. రాహుల్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.