ప్రియాంక గాంధీ పోటీచేస్తుండడంతో అందరి నోటా ఇప్పుడు ‘వయనాడ్’ గురించే చర్చ సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికలను ఎవరూ మరిచిపోలేదు. రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడంతో వయనాడ్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది.
వయనాడ్ లో ఓడిపోతాననే రాహుల్ గాంధీ రాయ్ బరేలిలో పోటీచేశారు. వయనాడ్ నియోజకవర్గంలో ముస్లింలు 2011 జనాభా లెక్కల ప్రకారం.. 41.3 శాతం ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా 44 శాతం మంది ముస్లింలు ఉన్నారు.
ప్రియాంక గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించారు. రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశించినా ఎన్నికల సమరంలోకి దిగలేదు. రాహుల్‌గాంధీ విజయం సాధించి రాజీనామా చేసిన వయనాడ్ నుంచి ఇప్పుడు పోటీ చేయడం ద్వారా ఎన్నికల సమరంలోకి దిగుతున్నారు. పలువురు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆమె వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రియాంక గాంధీ దశాబ్దాల రాజకీయం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వర్చారు. ముత్తాత పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ మాజీ ప్రధాని, తండ్రి రాహుల్ గాంధీ మాజీ ప్రధాని, తల్లి సోనియాగాంధీ ప్రతిపక్ష నేత, అన్న రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత. నెహ్రూ వారసత్వాన్ని ఇందిర కొనసాగించారు. ఇందిర వారసత్వాన్ని రాజీవ్ కొనసాగించారు. రాజీవ్ వారసత్వాన్ని కొనసాగించడంలో రాహుల్ తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక పార్టీ నేతలకు ఆశాదీపంగా మారారు.
రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ వయనాడ్ సీటులో.. ఇప్పుడు ప్రియాంక గాంధీని పోటీకి పెట్టడం వెనుక కారణం అదే. ఇది కాంగ్రెస్ కు సేఫ్ సీట్. కాంగ్రెస్ ఒక నయా ముస్లిం లీగ్ అని చెప్పొచ్చు.