https://oktelugu.com/

Revanth Reddy : రాజకీయాలు వేరు పాలనా వేరు రేవంత్ రెడ్డి నిర్ణయాలు బాగున్నాయి

Revanth Reddy: కాంగ్రెస్ రాజకీయాల్ని వ్యతిరేకించినంత మాత్రాన పాలనలో మంచిని వ్యతిరేకించాలా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2024 / 08:09 PM IST

    Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు ఆకట్టుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ రివర్, సమీకృత ఇంటిగ్రేటెడ్ గురుకులాలు మంచి నిర్ణయాలుగా చెప్పొచ్చు.ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి అన్నది రేవంత్ రెడ్డి ఎంచుకున్న గొప్పనిర్ణయం. కేసీఆర్ చేపట్టిన ఈ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తలకెత్తుకున్నారు. నిర్వాసితులకు భయపడి కేసీఆర్ విరమించుకున్నారు. కానీ రేవంత్ ఈ విషయంలో పట్టుదలగా ముందుకెళుతున్నారు. నిర్వాసితుల విషయంలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళుతున్నారు.

    ఇక హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ బాగుంది. ఆక్రమణల విషయంలో ఆయన పట్టుదల మెచ్చుకోదగినది. హైడ్రా విషయంలో లోపాలున్నాయి.వాటిని ఎలా సరిదిద్దాలో మేధావులు సూచించాలి.

    కాంగ్రెస్ రాజకీయాలు ఏ విధంగానూ మంచి రాజకీయాలు కాదు.. తెలంగాణ పాలనలో చూస్తే రేవంత్ రెడ్డి ఆలోచనలు బాగా ఉన్నాయి. రుణమాఫీ విషయంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. 2 లక్షల లోపు రుణాలను రైతులకు మాఫీ చేయడం ఒక గొప్ప నిర్ణయంగా చెప్పొచ్చు.

    కాంగ్రెస్ రాజకీయాల్ని వ్యతిరేకించినంత మాత్రాన పాలనలో మంచిని వ్యతిరేకించాలా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.