Telangana Liberation Day : నిన్న సెప్టెంబర్ 17 నిజాం నవాబు కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసిన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం చేసిన రోజు. నిజాం నవాబు నుంచి బానిస సంకెళ్లు తెంచిన రోజు. అలాగే రాచరిక పాలననుంచి ప్రజా పాలన వచ్చిన రోజు.. భారత్ ఐక్యంగా ఉండడానికి దోహదం చేసిన రోజు.
5 విచార ధారలు ఐదు పేర్లతో పిలిచారు. ఏ పేరుతో పిలిచినా ఎప్పుడూ జరగనంత ఘనంగా సెప్టెంబర్ 17ను నిన్న తెలంగాణ జరుపుకుంది. ఆరోజును గుర్తు చేసుకోవడానికి.. ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఇన్నాళ్లు పట్టాలా? అన్నది ఆలోచించండి.. స్వాతంత్ర్యం వచ్చాక 74 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుపుకోవడానికి కారకులు ఎవరు? అన్నది ఆలోచించండి..ఇన్నాళ్లు నుంచి తెలంగాణలోని వాడవాడన, పల్లె, పట్నంలలో ఎందుకు ఇన్నాళ్ల నుంచి ఎగురవేయలేదు అన్నది ప్రశ్నించుకోవాలి. ఇది మనసును తొలుస్తున్న ప్రశ్న.
ప్రతీ పార్టీ ఏదో ఒక పేరుతో పండుగలా చేశారు. ఒక్క మజ్లిస్ తప్ప అన్నీ పార్టీలు సెప్టెంబర్ 17ను జరుపుకున్నారు. ఈ పండుగకు ఇన్నాళ్లు పట్టకూడదు. మూడేళ్ల క్రితం మోడీ ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ ఉత్సవాలు జరిపింది. అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు జరిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు మార్చి ఉత్సవాలు జరిపారు.
కేంద్రం చొరవతోనే ఇప్పుడు అధికారికంగా తెలంగాణ విమోచన దినం మొదలైంది.. ఊపందుకుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.