AP Politics : ఆంధ్రా ఎన్నికలు అయిపోయాయి. రాజకీయాలు గురించి కాకుండా.. రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయాల్లో కుటుంబాలు అత్యంత ప్రభావం చూపిస్తున్నాయి.
ఆంధ్రాలో అత్యంత ప్రభావం చూపించిన కుటుంబం ‘ఎన్టీఆర్’ కుటుంబం. తన ఇంపాక్ట్ తో కుటుంబం విస్తరించి రాజకీయాల్లోకి ఎక్కువమంది వచ్చారు. అల్లుడు చంద్రబాబు ముఖ్యంగా తెరపైకి వచ్చాడు. తెలుగుదేశం అధినేతగా మారాడు. తర్వాత బాలకృష్ణ, కూతురు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా రాణిస్తున్నారు. లోకేష్ మంగళగిరి నుంచి పోటీచేస్తున్నారు. బాలయ్య అల్లుడు భరత్ విశాఖ నుంచి పోటీచేస్తున్నారు.
ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఐదుగురు పోటీలో ఉన్నారు. ఇక రెండోది మెగా కుటుంబం.. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నా.. పవన్ కళ్యాణ్ జనసేనతో ప్రభావం చూపిస్తున్నారు. పవన్ పోటీచేస్తుండగా.. నాగబాబు పోటీ నుంచి విరమించుకున్నారు. మెగా కుటుంబం నుంచి హీరోలందరూ పవన్ తరుపున ప్రచారం చేస్తున్నారు.
యనమల కుటుంబం , కేశినేని కుటుంబం, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి పోటీచేస్తుండగా.. తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరుఫున బరిలో దిగారు. ముత్యాలనాయుడు కొడుకు , కూతురు ఇద్దరూ పోటీచేస్తున్నారు.
ఇలా ఏపీలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆంధ్రా ఎన్నికల్లో రెండు కుటుంబాల గొడవలు జనాన్ని కదిలించాయి.. ఆ కుటుంబాలు ఏవీ? వాటి గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.