Allu Arjun Bail :అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు విధంగా వెళుతోంది. లగచర్ల రైతుల విషయంలోనూ దారుణంగా వ్యవహరించింది. చట్టం తన పని తాను చేసుకు పోతుందని రేవంత్ రెడ్డి అనడం నేషనల్ మీడియాలో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ మానవహక్కుల ఉల్లంఘన గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అసలు అంతగా హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఇవ్వాళ క్వాష్ పిటీషన్ వస్తుందని అరెస్ట్ చేయడం దారుణం. అరెస్ట్ కూడా ఆయన బెడ్ రూం వరకూ వెళ్లి బట్టలు మార్చుకోనీయకుండా చేయడం చూస్తే తెలంగాణలో పోలీసుల ప్రవర్తన అతి దారుణంగా ఉంటోంది.
తెలంగాణలో నిన్నటికి నిన్న రైతులను బేడీలు వేసుకొని తీసుకురావడం ఎంత దారుణంగా కాంగ్రెస్ పాలన ఉందో అర్థంచేసుకోవచ్చు.
అల్లు అర్జున్ అరెస్ట్ తో ఈరోజు దేశమంతా అన్ని మీడియా సంస్థలు కూడా సంచలనమైన వార్తగా ప్రచురిస్తున్నాయి. సెలబ్రెటీ.. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు సంపాదించిన సినిమా హీరోను అరెస్ట్ చేసిన తీరు వివాదాస్పదమైంది.
కేసు పెట్టారు. ఏ11గా చూపించారు. ఏ11 ఉంచిన అల్లు అర్జున్ తనకు సంబంధం లేదని క్వాష్ పిటీషన్ వేస్తే.. ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే.. పారిపోయే వ్యక్తి కాదు.. ఆయన వచ్చే వరకూ కూడా ఆగలేదు. కనీసం బట్టలు మార్చుకుందామన్నా పోలీసులు ఛాన్స్ ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
పోలీసులు తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవటానికే అరెస్టుతో అతిగా స్పందించారా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.