https://oktelugu.com/

PM Modi : మోడీ సానుకూల ప్రభంజనం తమిళనాట కమ్మేసిందా?

మోడీ సానుకూల ప్రభంజనం తమిళనాట కమ్మేసిందా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : April 10, 2024 / 02:21 PM IST

    PM Modi : చెన్నైలో నిన్న మోడీ ర్యాలీ అద్భుతంగా జరిగింది.. పాండి బజార్.. టీనగర్, పానగల్ పార్క్.. లలో ప్రచారం జోరుగా సాగింది. తేనంపేట వరకూ 45 నిమిషాలు ర్యాలీ జరిగింది. ప్రజల స్పందన చూస్తుంటే.. మోడీ సునామీ తమిళనాట.. చెన్నైలో కూడా ప్రవేశించిందా? అన్న డౌట్ ప్రతీవారికి వచ్చింది.

    ఉత్తర భారతంలో మోడీకి క్రేజ్ ఉంది. అక్కడ మోడీకి వచ్చినంత జనం తమిళనాట రావడం.. స్పందన అదిరిపోయేలా ఉండడం బీజేపీకి ఆశలు చిగురింపచేస్తోంది. వాళ్లలో చాలా జోష్ ఉత్సాహం నెలకొంది. ఇన్నాళ్లకు 1967 తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. 1970 నుంచి కాంగ్రెస్ పోయింది. డీఎంకే.. అన్నాడీఎంకే మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికీ అదే సంగతి..

    జాతీయ పార్టీలు తమిళనాడులో ఎదగలేదు. డీఎంకే చాటునో.. అన్నాడీఎంకే చాటునో దాక్కొని జాతీయ పార్టీలున్నాయి. కాంగ్రెస్ అయితే చేతులెత్తేసింది. కాంగ్రెస్ తప్పు ఉంది. కాంగ్రెస్ కాంప్రమైజ్ అయ్యి పెద్ద తప్పు చేసింది.

    ఉత్తరప్రదేశ్ , బెంగాల్, మహారాష్ట్రలో ఇప్పటికే ఇలా కాంగ్రెస్ కుదేలైంది.. ఇప్పుడు తమిళనాట కూడా ఇదే పరిస్థితికి కాంగ్రెస్ దిగజారింది. కాంగ్రెస్ పోటీ లేకుండా పోయింది.

    మోడీ సానుకూల ప్రభంజనం తమిళనాట కమ్మేసిందా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.