https://oktelugu.com/

PM Modi : ప్రధాని మోడీని ఆహ్వానించినందుకా లేక వినాయక పూజ కాబట్టా ఎందుకింత రభస?

ప్రధాని మోడీని ఆహ్వానించినందుకా లేక వినాయక పూజ కాబట్టి ఎందుకింత రభస? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2024 / 11:57 AM IST

    PM Modi : నిన్న గణేష్ పూజకు ప్రధాని మోడీ, ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఇంటికి వెళ్లినందుకు రభస, రభస చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఏమైనా అర్థముందా? అదేమైనా రహస్య సమావేశమా? వీడియో కూడా రిలీజ్ చేశారు. ట్విట్టర్ లో మోడీ కామెంట్ చేశాడు.

    మోడీ ట్విట్టర్ లో వీడియో పెట్టకపోతే ఇద్దరూ రహస్యంగా కలిశారని ఇవే ప్రతిపక్షాలు ఆరోపించేవారు. ఒక గణేష్ పూజ అనేది అది పవిత్రమైన కార్యక్రమం. అటు మోడీ కూడా విపరీతమైన భక్తి ఉన్న వ్యక్తి కాబట్టి సీజేఐ ఇంటికి వెళ్లి పూజలు చేశాడు.

    గణపతి చవితి రోజున ఇతరులను ఆహ్వానించడం సంప్రదాయం. చంద్రచూడ్ కూడా మోడీని ఆహ్వానించగా.. మోడీ వెళ్లాడు. దానికి మోడీ వెళ్లి హాజరయ్యాడు.

    దేశానికి ప్రధాని.. దేశానికి ప్రధాన న్యాయమూర్తి పిలవడాన్ని ఎందుకు శంకిస్తారు. విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి క్యారెక్టర్ ను హననం చేయడం దారుణం. ప్రశాంత్ భూషణ్ ఈ వివాదాన్ని రాజేశాడు. విచ్చిన్నకారిగా ప్రవర్తిస్తున్నాడు.

    ప్రధాని మోడీని ఆహ్వానించినందుకా లేక వినాయక పూజ కాబట్టి ఎందుకింత రభస? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.