మోడీ తీరే వేరు.. ప్రచారం వేరు.. అదో పెద్ద సునామీ.. ప్రచారాన్ని ఎప్పుడు కూడా రెండు భాగాలుగా చేయాలి. మోడీ రాకముందు.. వచ్చిన తర్వాత.. మూడ్ ఆఫ్ ది పీపుల్ ను మార్చవచ్చు. జనం నాడిని పట్టుకోవడంలో మోడీకి ఎవరూ సాటిలేరు.
అదే సమయంలో ప్రత్యర్థుల గుండెల్లో గునపాలు ఎలా దించాలో మోడీకి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. జనంతో ఎలా కనెక్ట్ కావాలో మోడీకి తెలిసినట్టు ఎవరికి తెలియదు.
తెలంగాణ, ఆంధ్రలో మోడీ సుడిగాలి పర్యటన ఓ ఊపు ఊపేసింది. హిందీ ప్రాంతాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మోడీ సునామీ వీచింది.
ముందు రోజు రాత్రి పీవీ నరసింహరావు కుటుంబాన్ని పరామర్శించారు. వారితో గడిపారు. తెలియకుండా అంతర్లీనంగా ఇది ఎంతో మంది కాంగ్రెస్ వాదులను మోడీ వైపు తిప్పింది.
ఆ తర్వాత వేములవాడ రాజరాజశ్వేర దేవాలయంకు వెళ్లి పూజలు చేసి భక్తిభావం పెంపొందించారు. ఒక ప్రసంగానికి మరో ప్రసంగానికి తేడా ఉంటుంది. ఆంధ్రాలో డిఫెరెంట్ గా మాట్లాడారు. ఎక్కడికక్కడ విభిన్నంగా అక్కడి రాజకీయం బట్టి మాట్లాడారు.
మోడీ సునామీ తెలుగు వాళ్ళ హృదయాల్ని దోచుకుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.