https://oktelugu.com/

PM Modi: ఎలక్ట్రానిక్స్ లాగా రక్షణరంగాన్ని ఎగుమతుల హబ్ గా మార్చిన మోడీ

ప్రైవేట్ రంగం లేదు. మిగతా అన్ని దిగుమతులే. 2023-2024కు అది లక్షా 27వేల కోట్లుకు చేరుకుంది. మూడు రెట్లు ఏకంగా పెరిగింది. ఇక ఎగుమతుల విషయానికి వస్తే 2013-2014ల మధ్య కేవలం 1900కోట్లు మాత్రమే.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 29, 2024 / 08:07 PM IST

    Ram Talk : నిన్న వడోదరలో మోడీ స్పానిష్ ప్రధానమంత్రితో కలిసి రక్షణ రంగానికి ఉపయోగపడే సరుకు రవాణా ఎయిర్ క్రాప్ట్ ను ప్రారంభించారు. ఇది చిన్న విషయమే కదా అని అనుకోవచ్చు. కానీ ఇది చిన్న విషయం కాదు. రక్షణ రంగం ప్రగతికి అది చిహ్నం. ప్రైవేట్ రంగంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఈ రోజు ఇలా మొదలైంది రేపు ఎక్కడి కైనా వెళ్లవచ్చు. ఇదే మొదలు. 2013 -2014మనకు రక్షణ ఉత్పత్తులన్నీ కేవలం రూ.40వేల కోట్లు మాత్రమే. అప్పట్లో ఉంది కేవలం పబ్లిక్ రంగమే. ప్రైవేట్ రంగం లేదు. మిగతా అన్ని దిగుమతులే. 2023-2024కు అది లక్షా 27వేల కోట్లుకు చేరుకుంది. మూడు రెట్లు ఏకంగా పెరిగింది. ఇక ఎగుమతుల విషయానికి వస్తే 2013-2014ల మధ్య కేవలం 1900కోట్లు మాత్రమే.

    అదే 2023-2024వచ్చే సరికి అది 21,800కోట్లకు చేరుకుంది. మూడు రెట్లు ఉత్పత్తి పెరిగింది. ఎగుమతులు కూడా పది రెట్లు పెరిగాయి. మొబైల్స్ ఎగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. రక్షణ రంగ ఉత్పత్తుల్లో కూడా భారత్ ఆ స్థానానికి చేరడానికి కృషి చేస్తుంది. వచ్చే నాలుగేళ్లలో ఉత్పత్తులు లక్షా 27వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల ఉత్పత్తులను సాధించాలని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. 2028-2029నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే సమయంలో ఎగుమతులను కూడా 21వేల కోట్ల నుంచి 50వేల కోట్లకు టార్గెట్ పెట్టుకున్నారు.

    2013-2014ల మధ్య రక్షణ రంగం బడ్జెట్ కేవలం రూ.2.03లక్షల కోట్లు. అదే 2023-2024నాటికి 5.93లక్షల కోట్లకు పెరిగింది. దాదాపు ఆరు లక్షల కోట్లు అంటే దాదాపు 3రెట్లు పెరిగింది. నేడు మన రక్షణ ఉత్పత్తులను వంద దేశాలను ఎగుమతి చేస్తున్నాము. బ్రహ్మోస్ మిస్సైల్స్, పినాకా లాంటి వాటిని పలు దేశాలకు ఎగుమతులు చేస్తున్నాము. గన్స్ , రేడార్స్, ఆర్మ్ డ్ వెహికల్స్ ఇలా ఎన్నో రకాల రక్షణ పరికరాలను మనం దేశం ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ లాగా రక్షణరంగాన్ని ఎగుమతుల హబ్ గా మార్చిన మోడీ గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.