https://oktelugu.com/

Jan Dhan Yojana: జన ధన్ బ్యాంకు ఖాతా మొదలై దశాబ్దం గడిచింది

జన ధన్ బ్యాంకు ఖాతా మొదలై దశాబ్దం గడిచిన వేళ ‘మోడీ’ చేస్తున్న అభివృద్ధిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2024 / 08:38 PM IST

    మోడీ.. పేదలకు కొమ్ముకాస్తున్నాడా? పెద్దలకు కొమ్ము కాస్తున్నాడా? రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతిసారి అదానీ, అంబానీలకు ఏజెంట్ గా మాట్లాడుతుంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే.. రోజూ ధనవంతులను తిడుతూ ఉండాలి. కాంగ్రెస్ హయాంలో అదే జరిగింది.

    ఇదే నిజమైతే.. ప్రపంచ బ్యాంక్ మోడీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నివేదిక ఇచ్చింది. అంత ధనవంతులకు కొమ్ముకాస్తే 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటకు ఎలా వచ్చారు.

    ఓట్ల కోసం రాహుల్ గాంధీ రాజకీయం బాగానే ఉంటుంది. మోడీ ప్రభుత్వ పర్ ఫామెన్స్ చూస్తే.. మోడీ హయాంలో గణాంకాలు చూస్తే.. పేదరికం నుంచి స్వాతంత్ర్య భారతదేశంలో పేదలను బయటకు తీసుకొచ్చింది కేవలం మోడీ మాత్రమేనని తేలింది.

    మోడీ విధానమేంటి? గరీబీ హఠావా అంటే పేదరికం పోదు కదా.. పేదరికం తొలగించడానికి మొట్టమొదటి చర్యలు తీసుకున్నది మోడీనే.. మోడీ ఈ దేశ ప్రజలకు టాయిలెట్లు కట్టిస్తానంటే నవ్వారు. కానీ మహిళల ఆత్మగౌరవాన్ని మోడీ కాపాడాడు. ఇక జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేయించి బ్యాంకులకు 5 నెలల టార్గెట్లు పెట్టారు. 5 నెలల్లో 12 కోట్ల ఖాతాలు ఓపెన్ చేయించాడు.

    ఈరోజు కోవిడ్ వచ్చాక ప్రతినెల ఉచిత బియ్యం ఇస్తున్నాడు. రైతులకు కిసాన్ యోజన కింద డబ్బులు ఇస్తున్నాడు. పేదలకు ఇల్లు కట్టించాడు.

    జన ధన్ బ్యాంకు ఖాతా మొదలై దశాబ్దం గడిచిన వేళ ‘మోడీ’ చేస్తున్న అభివృద్ధిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.