Pawan Kalyan : జనసేనలో భారీగా చేరికలు చోటుచేసుకున్నాయి. వాళ్లు ఏమీ ఆషామాషీ లీడర్లు కాదు.. వైసీపీలో కీలక స్థానంలో ఉన్నవారే.. మాజీ మంత్రి, జగన్ కు బంధువు అయిన బాలినేని శ్రీనివాసులు వైసీపీని వీడి జనసేనలో చేరడం ఓ సంచలనంగా చెప్పొచ్చు. సామినేని ఉదయభాను రెండు సార్లు ఎమ్మెల్యే, చీఫ్ విప్ గా చేశారు. కిలారు రోశయ్య గుంటూరు పార్లమెంట్ కు వైసీపీ తరుఫున పోటీచేశారు. ఉమ్మారెడ్డి అల్లుడే ఈ రోశయ్య.. కంది రవిశంకర్ ఒంగోలు పారిశ్రామికవేత్త.. వీళ్లతోపాటు విజయనగరం నుంచి ఇద్దరు వైసీపీ యువ నేతలు, నెల్లూరు నుంచి ఒక నిర్మాత జనసేనలో పవన్ సమక్షంలో చేరారు.
బాలినేని తప్పితే మిగతా వారిలో మెజార్టీ కాపు సామాజికవర్గం నేతలే కావడం గమనార్హం. ఈ చేరికలు ఏం చెప్తున్నాయి. ఈ చేరికలు చూస్తే.. ‘ఒకటి క్లియర్ గా అర్థమవుతోంది ఏంటంటే.. జగన్ కు భవిష్యత్ లేదని.. అందుకే వైసీపీని వీడుతున్నారు. ఇంకా చాలా మంది నేతలు వస్తారని అంటున్నారు. పవన్ ఫిల్టర్ చేస్తున్నాడట..
జనసేన సడెన్ గా 21 సీట్లు రావడంతో వీరందరూ రావడం లేదు. పవన్ స్టామినా రోజురోజుకు పెరుగుతోంది. జనసేన పర్మనెంట్ పవర్ హౌస్ గా ఏపీలో ఎదుగుతోంది.
మరి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లకుండా జనసేనలోకి ఎందుకు వెళుతున్నారంటే.. పవన్ ఇమేజ్ నే.. ఈ వ్యక్తులు టీడీపీని తిట్టి దాన్ని ఎదుర్కొని ఆ పార్టీలోకి వెళ్లలేకపోతున్నారు. అందుకే ప్రత్యామ్మాయంగా జనసేనలో చేరుతున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణలో వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.