Pawan Kalyan : ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తొలిసారి పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయారు. కానీ ఆ ఓటమి నుంచి తేరుకొని పార్టీని పట్టాలెక్కించి ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చిన తీరు నిజంగా ప్రశంసనీయం.. ఇటు చంద్రబాబును, అటు మోడీని ఒప్పించి ఏపీ, కేంద్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ ఘనతనే అని చెప్పొచ్చు. పవన్ వ్యూహచతరుత బాగా పనిచేసింది. పవన్ సెలబ్రెటీ అనుకున్నారు కానీ ఇంత వ్యూహకర్త అని అనుకోలేదు. చంద్రబాబుకు పొలిటికల్ లైఫ్ ఎలా ఇచ్చాడో.. తర్వాత బీజేపీకి లైఫ్ ఇచ్చింది కూడా పవన్ కళ్యాణ్ నే.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోకపోతే జనసేన సీట్లు త్యాగం చేసి తన అన్న నాగబాబు అనకాపల్లి సీటును కూడా త్యాగం చేసి బీజేపీని ఒప్పించాడు. దాంతో బీజేపీకి పవన్ కీలక నేతగా మారారు. ఆప్యాయ లీడర్ గా ఎదిగాడు.
చంద్రబాబు జైల్లో పడ్డప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు టీడీపీ, జనసేనలో జోష్ నింపింది. ఆరోజు జైలు బయట చేసిన పొత్తు ప్రకటనతో ప్రతిపక్షం ఏకమై బాగా పనిచేసింది. ఇక్కడ చంద్రబాబుకు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న లీడర్ గా పవన్ ఇప్పుడు కీలక రోల్ లో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో అందరూ చర్చించుకుంటున్న వ్యక్తి. ఎవ్వరూ దీన్ని ఊహించలేదు. ఈరోజు మొత్తం హోదానే మారిపోయింది. ఎన్నికల ముందు కేవలం 24 స్థానాలు తీసుకున్నందుకు జనాల్లో పవన్ పై కోపం పెరిగిపోయింది. మనం కూడా చాలా బాధపడ్డాం. తక్కువ సీట్లు తీసుకున్నందుకు మథనపడ్డాం.కానీ పవన్ వ్యూహమే సరైనదని తేలింది.
దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన పవన్ కళ్యాణ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.