Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. నిన్నటి గొల్లప్రోలు సభలో పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమట.. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా శాంతిభద్రతల గురించి మాట్లాడాడు. రాష్ట్రానికి శాంతిభద్రతలు అత్యంత అవసరం. ఆ విషయంలో ఉదాసీనత వ్యవహరించడం దారుణాతి దారుణం. మీరు ఇదే పద్ధతిలో కొనసాగితే..యోగి ఆదిత్యనాథ్ చేసినట్టుగా పాలన చేయాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు.
పవన్ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు అందరూ జాతీయ మీడియాలో విరుచుకుపడ్డారు. మనసులో పవన్ పై ద్వేషం పెంచుకున్నారు. తిరుపతి సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పటి నుంచి పగ పెంచుకున్నారు. అప్పటి నుంచి పవన్ ఇప్పుడు ఉదారవాదులందరికీ విలన్ గా కనిపిస్తున్నారు. పవన్ ను విలన్ ను చేయాలని దేశంలోని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి.
యోగి ఏం చేశాడని పవన్ ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చూస్తే.. ‘యోగి యూపీలో అధికారంలోకి వచ్చాక ఎంచుకున్న మొట్టమొదటి పని ఏంటంటే.. క్రిమినల్స్ ను ఏరిపారేయడం.. యూపీలో క్రిమినల్స్ కు ఎంతో ప్రసిద్ధి. మాఫియా రాజ్యంగా ఉండే యూపీలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారిని ఏరిపారేశాడు. సామాన్య ప్రజలకు శాంతి భద్రతలు చాలా ముఖ్యం. హక్కులు భంగం కలుగకూడదు. మహిళల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తే ఏం చేసినా సపోర్టు చేస్తానని యోగి పోలీసులకు అభయమిచ్చారు.
పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ని పొగడటం జీర్ణించుకోలేని ప్రతిపక్షాల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.