Pawan Kalyan Grama Sabha : మైసూర్ వారి పల్లె చరిత్ర సృష్టించింది. ఆ చిన్న గ్రామానికి అంతటి పేరు ప్రతిష్టలు రావడంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన గ్రామసభ కీలకభూమిక పోషించింది. ఆ గ్రామంలో పండే ఉద్యానవన పంటలు.. మామిడి, అరటి, పొప్పాయి పంటలు పండుతాయని పవన్ పర్యటించిన తర్వాతే తెలిసింది. దాంతోపాటు గ్రామాల్లో సమస్యలు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పటికీ ఎన్ని పనులు చేశారు. ముందు ముందు చేయాల్సిన పనులు ఏంటి? అన్నది పవన్ గ్రామసభతో అందరికీ తెలిసి వచ్చింది.
మైసూర్ వారి పల్లెకి పవన్ వెళ్లడంతో అక్కడ చరిత్ర సృష్టించింది. ప్రజలకు గ్రామసభల ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. పల్లెల సమస్యలు తెలియవచ్చాయి.
కారుమంచి సంయుక్త. ఓ ఆర్మీ జవాన్ భార్య, ఆయన చనిపోవడంతో ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఆవిడ తన భర్త ఆశయాల కోసం సర్పంచ్ గా ఎన్నికైంది. ఆవిడ గ్రామసమస్యలను జనానికి, రాష్ట్రానికి తెలియజేసింది. స్కూలుకు కనీసం ప్లే గ్రౌండ్ లేని విషయాన్ని చెప్పింది.
గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన వారిని గుండా యాక్ట్ తీసుకొచ్చి వీరిని అవసరమైతే కక్కిస్తామని పవన్ ప్రకటించడం జనాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక స్కూలుకు 10 సెంట్ల స్థలం ఇచ్చిన కారుమంచి నారాయణను పిలిచి మరీ ఆయనతో సెల్ఫీ దిగి పవన్ ఆయన గొప్పతనాన్ని వివరించాడు.
జన చైతన్యమే లక్ష్యంగా సాగిన పవన్ కళ్యాణ్ గ్రామసభపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.