పవన్ కళ్యాణ్ తను తీసుకున్న శాఖలకీ రోజురోజుకు వన్నె తెస్తున్నాడు. పంచాయితీరాజ్ శాఖ కు రోల్ మోడల్ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ. అటువంటి కేరళ పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తున్న తెలుగు వ్యక్తి కృష్ణ తేజను తీసుకొచ్చే పెట్టుకోవడంలోనే పవన్ పనితీరు అర్థమైంది. ఇవాళ కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే.. 23వ తేదీన ఒకేసారి 13వేల పైచిలుకు పంచాయితీల్లో ఓకే రోజు గ్రామసభను నిర్వహిస్తున్నారు.
గ్రామసభ నిర్వహించాలని చట్టంలోనే ఉంది. గ్రామంలో పనులు చేపట్టాలంటే ఈ సభ తప్పనిసరి. పవన్ మొట్టమొదటి సారి గ్రామసభ ఎందుకు జరుపాలన్నది తెలియజేస్తున్నాడు.గ్రామ సభ వేల సంవత్సరాల నుంచి ఇదీ జరుగుతూనే ఉంది. పురాణాల్లోనూ గ్రామసభల ప్రాముఖ్యత ఉంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న గ్రామసభ చట్టంలో ఉన్నా కూడా ఎందుకు దాన్ని సీరియస్ గా అమలు చేయడం లేదు.
కేవలం పుస్తకాల్లో రాసుకుంటారు.. గ్రామసభ జరిగినట్టుగా నేతలు మమ అనిపించేస్తారు. గ్రామసభ ఈసారి మాత్రం ఖచ్చితంగా చేయాలని.. చేయకపోతే అధికారులను బాధ్యులను చేస్తామని.. రెండు రోజుల ముందు చాటింపు చేయాలని పవన్ కళ్యాణ్ నిన్నటి మీటింగ్ లో కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ పథకాలకు ప్రజల భాగస్వామ్యాన్ని జత చేసిన పవన్ కళ్యాణ్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.