Pawan Kalyan : ఈనాటి పవన్ కళ్యాన్ కాకినాడ పోర్ట్ దగ్గర చేసిన సాహసోపేత చర్యలు చూశాక ఆయన నాయకత్వ శైలిని ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోంది. ఇదే కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనిపిస్తోంది. ఇది కదా నాయకుడు చేయాల్సినటువంటి పని. ఇది కదా నాయకుడు తనంతా తానుగా రోల్ గా మోడల్ గా ఉండడానికి చేయాల్సిన పనులు. సముద్రంలోకి వెళ్లడమే కాకుండా పోర్ట్ అధికారులు వారిస్తున్నా దాని చుట్టూ తిరుగుతూ ఎలాగైనా షిప్ లోకి వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి.
కాకినాడ పోర్టు పాతికేళ్ల నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. పబ్లిక్ లో ఉన్నా.. ప్రైవేటులో ఉన్నా స్మగ్లింగ్ చేసే వారికి తేడా ఉండదు. సరైన పర్యవేక్షణ లేకపోతే పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా కాంప్రమైజ్ అవుతారు. ఈ పోర్టు వ్యవహారాల్లో రాష్ట్రం, కేంద్రం ఇద్దరూ ఇన్ వాల్వ్ అయ్యి ఉంటారు.
సముద్ర సరిహద్దుల్లో సరైన చర్యలు తీసుకోకపోతే ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా వచ్చే ఛాన్స్ ఉంది. ఉచిత రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తే.. రేపు ఆదాయాలు వచ్చే చాన్స్ ఉందని పవన్ హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రులు చేసుకున్న అదృష్టం.. పవన్ పాలనా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.