YS Jagan :అదానీ పై ఆరోపణలు దేశాన్ని కుదుపు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ కు ఇచ్చిన లంచాలపై ఇంకా ఎక్కువ చర్చ జరిగింది. 1750 కోట్లకు పైగా లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. జగన్ ను దెబ్బతీసే అవకాశం టీడీపీ, జనసేనకు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబును జైల్లో పెట్టిన జగన్ పైన కక్షసాధింపు చేపట్టే అవకాశం వచ్చింది.
జగన్, అదానీ బంధంపై ఎప్పుడు డబ్బులు చెల్లించారనే అంశాలపై పూసగుచ్చినట్టుగా కోర్టులో దాఖలు చేశారు. అయితే జగన్ ను టార్గెట్ చేసే అవకాశం చంద్రబాబుకు వచ్చింది. టీడీపీ కేడర్ కూడా జగన్ ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తోంది.
ఈ పరిస్థితిలో చంద్రబాబు ఎందుకు క్విక్ గా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ప్రాథమిక దర్యాప్తు చేసి జైల్లో పెడుతారా? అంటే కష్టమే అనిపిస్తోంది.
అయితే ఇక్కడ జగన్ ఒక్కడే కాదు.. జగన్ కంటే ముందు అదానీని అరెస్ట్ చేయాలి.. అదానీ మోడీకి చాలా సన్నిహితుడు. బీజేపీ దీనిపై స్టాండ్ తీసుకంది. అందుకే అదానీ జగన్ ల బంధంపై ఆచితూచి స్పందిస్తున్న పవన్ చంద్రబాబుల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.