Pawan Kalyan-Annamalai : నిన్న పీగురు అనే మోస్ట్ పాపులర్ చానెల్. ప్రో బీజేపీ హిందూ చానెల్ . పీగురు చానెల్ లో శ్రీరాం శేషాద్రి అనే మంచి అనలిస్ట్ ఉన్నారు. తమిళనాడులో ఈయన మోస్ట్ పాపులర్ అనలిస్ట్. సెఫాలజిస్ట్ ఈయన.. ఈయనతో ఇంటర్వ్యూ నిర్వహించారు. అదే పాపులర్ అయ్యింది.
అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై శ్రీరాం శేషాద్రి విశ్లేషించారు. 3 నెలల గ్యాప్ వల్ల అన్నామలై వెనుకబడ్డారని.. తమిళనాడులో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయిస్తే ఆ ఊపు వస్తుందని.. అన్నామలైకి పవన్ తోడైతే బీజేపీకి చాలా హెల్ప్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి గొప్ప ఊపు వస్తుందని అనలిస్ట్ శ్రీరాం శేషాద్రి విశ్లేషించారు. పవన్ సనాతన ధర్మం తమిళనాట గొప్పగా పనిచేస్తుందని.. తమిళనాడు చెన్నైలో పెరిగిన పవన్ వల్ల బీజేపీకి బాగా మేలు జరుగుతుందని శ్రీరాం శేషాద్రి సూచించారు.
జనసేన పార్టీని తమిళనాడులో పెడితే బాగా క్రేజ్ వస్తుందని అన్నాడు. దీన్ని బట్టి పవన్ క్రేజ్ దేశవ్యాప్తం అవుతోంది. పవన్ మేనియాను దేశమంతా గుర్తిస్తుందని తెలుస్తోంది.
అన్నామలై పవన్ కళ్యాణ్ కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్లే.. తమిళనాడు రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.